వికటించిన ‘వ్యాక్సిన్’

వివేక్ అగ్నిహోత్రీ.. ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూప్స్ ద్వారా పాపులర్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అది కూడా కశ్మీర్ ఫైల్స్ మూవీ తర్వాత. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ చిత్రాన్ని అతను రూపొందించాడు. బట్ అవి కొందరికి ఆనందాన్ని పంచాయి. అంతే.. కంటెంట్ పరంగా వీక్ గా ఉన్నా, కథ, కథనాలు వరస్ట్ అనిపించుకున్నా.. కావాలని ఆ సినిమాను ప్రమోట్ చేశారు. కట్ చేస్తే ఏకంగా 300 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించింది. కంటెంట్ ఎలా ఉన్నా.. కాసులు రాల్చింది.

ఇక ఈ సినిమాపై కొందరు తటస్థవాదులు విమర్శలు చేస్తే తనేదో అద్భుత కళాఖండాన్ని తీశానని అందరికీ ఓ రేంజ్ లో కౌంటర్స్ వేశాడు దర్శకుడు. ఇంకా చెబితే తన కశ్మీర్ ఫైల్స్ దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తట్టుకోలేకపోయిందని.. నెక్ట్స్ సలార్ ను కూడా అలాగే చేస్తానని కొన్నాళ్ల క్రితం బీరాలు పోయాడు. అనుకున్నట్టుగానే సలార్ విడుదల టైమ్ అయిన సెప్టెంబర్ 28కే తన వాక్సిన్ వార్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. సలార్ పోస్ట్ పోన్ అయింది. ది వాక్సిన్ వార్ విడుదలైంది.


నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి, రీమా సేన్, అనుపమ్ ఖేర్(ప్రధాన మంత్రి పాత్రలో) కీలక పాత్రల్లో నటించిన ది వాక్సిన్ వార్ ను పట్టించుకున్న వారే లేరు. విశేషం ఏంటంటే.. కంటెంట్ పరంగా ఈ చిత్రం కశ్మీర్ ఫైల్స్ కంటే బెటర్ గా ఉందన్నారు. అయినా ఆడియన్స్ నుంచి సాధారణ స్పందన కూడా లేదు. ఇంకా చెబితే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తన సినిమా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పిన వివేక్ అగ్నిహోత్రి కనీసం ఇతర భాషల్లో విడుదల చేయడంలో కూడా తడబడ్డాడు.

ఈ మూవీ తెలుగుల�