వెంకీ సైంధవ్ కొత్త రిలీజ్ డేట్

విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా. ఈ మైల్ స్టోన్ మెమరబుల్ గా మారాలంటే బ్లాక్ బస్టర్ కొడితేనే సాధ్యం అవుతుంది. అందుకే ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని రేంజ్ లో వెంకటేష్‌ సైంధవ్ ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాలు స్ట్రాంగ్ గా చెప్పకుంటున్నాయి.

హిట్, హిట్2 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన శైలేష్‌ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కమల్ హాసన్ విక్రమ్ లాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని చెబుతున్నారు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ ను ఆల్రెడీ చూసిన మైండ్ బ్లోయింగ్ అంటున్నారు.
సైంధవ్ ఫీమేల్ లీడ్స్ గా రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఆండ్రియా జెర్మియా ఓ స్పెషల్ రోల్ చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా నటిస్తున్నాడు.

ఎలా చూసినా పర్ఫెక్ట్ కాంబోగానూ, ష్యూర్ షాట్ లానూ కనిపిస్తోన్న ఈ చిత్రాన్ని మామూలుగా డిసెంబర్ 22న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే రోజు ప్రభాస్ సలార్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో సైంధవ్ ను సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారట. అన్నీ కుదిరితే జనవరి 13న విడుదల చేయాలనుకుంటున్నట్టు టాక్. సో.. అదే నిజమైతే సంక్రాంతి బరిలోకి మరో సినిమా చేరినట్టే అవుతుంది.

Related Posts