టాలీవుడ్

Vijay devarakonda : లవ్, యాక్షన్, ఫ్యామిలీ అంటోన్న విజయ్ దేవరకొండ

ఎవరి కెరీర్ లో అయినా అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగులుతుండాలి. అప్పుడే కాస్త సర్దుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి చూపులుతో ఫేమ్ అయి అర్జున్ రెడ్డి, గీత గోవిందంతో స్టార్ అయిన విజయ్ దేవరకొండకు ఆ తర్వాత ఏదీ కలిసి రాలేదు. వరుసగా నాలుగైదు ఫ్లాపులు పడ్డాయి. ముఖ్యంగా లైగర్ తో అభాసు పాలయ్యాడు. తప్పంతా దర్శకుడితే అయినా లాస్ హీరోకూ వర్తిస్తుంది కదా..? అలా లైగర్ తో కోలుకోని షాక్ తిన్నాడు విజయ్ దేవరకొండ.

ఈ మూవీ వల్ల అతను చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు కూడా. అయితే వీలైనం త్వరగా ఆ బాధ నుంచి బయటకు రావాలని ఖుషీ చేస్తే.. అది కాస్తా సమంత అనారోగ్యం వల్ల దాదాపు యేడాది పాటు లేట్ అయింది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని సాంగ్స్ చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ కంప్లీట్ గా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా వస్తోంది.


ఖుషీ తర్వాత యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ఓ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ పోలీస్ గా నటిస్తుండటం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటి వరకూ విజయ్, గౌతమ్ చేయనంత యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందట. సో.. ఖుషీ వంటి లవ్ స్టోరీ తర్వాత ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పడితే ఆడియన్స్ కు కూడా కొత్తగా ఉంటుంది. మంచి కంటెంట్ బ్లాక్ బస్టర్ కూడా పడుతుంది.మరి ఈ ప్లానింగ్ ఎవరు ఇచ్చారో కానీ.. విజయ్ వెంటనే ఫ్యామిలీ సబ్జెక్ట్ కు ఓకే చెప్పాడు.

అంటే ఖుషీతో లవ్ స్టోరీ, గౌతమ్ తో యాక్షన్ మూవీ కాగానే ఈ రెండూ రిపీట్ కాకుండా ఫ్యామిలీ స్టోరీతో వస్తున్నాడు. అది కూడా తనకు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చిన పరశురామ్ డైరెక్షన్ లో. దిల్ రాజు నిర్మించబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్ గా నటిస్తుంది అంటున్నారు. ఇంకా కన్ఫార్మ్ కాలేదు. సో.. వరుసగాఫ్లాపులు వస్తున్నప్పుడు రెగ్యులర్ మూవీస్ చేయకూడదు. చేసినా రిపీట్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే ఒకవేళ సినిమా యావరేజ్ అయినా ఫ్లాప్ అని వెంటనే అనరు. పైగా చూసేవారికీ ఫ్రెష్ గా ఉంటుంది. సో.. ఈ కొత్త ప్లానింగ్ తో వెళుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

44 mins ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

3 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

4 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

4 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

4 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

9 hours ago