టాలీవుడ్

Telangana : తెలంగాణ అంటే మందు, మటనేనా..?

ఒకప్పుడు తెలంగాణ వారిని సినిమాల్లో విలన్స్ గా చూపించారు. అస్సలే మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇచ్చారు. ఇంకా చెబితే వారి భాషను, యాసను గేలి చేశారు అంటూ తెలంగాణ వాసులంతా సినిమా వారిపై మండి పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ వచ్చి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో సినిమా పరంగానూ ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రాంతీయ సినిమాకు కూడా పట్టం కడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ క్రమంలోనే పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఫిదా సినిమా ఆంధ్రలో కూడా అఖండ విజయం సాధించింది.


పెళ్లి చూపులు, జాతి రత్నాలు, బలగం వంటి ప్యూర్ తెలంగాణ మట్టి వాసన ఉన్న చిత్రాలను అన్ని ప్రాంతాల్లో ఆదరించారు. విజయం అందించారు. అయితే ఒకప్పుడు తెలంగాణ వారిని అవమానిస్తున్నారు అని చెప్పినవాళ్లే.. ఇప్పుడు తెలంగాణను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం మందు, మటన్ అనేలా సినిమాల్లో చూపిస్తూ.. ఇతర ప్రాంతాల వారి ముందు చులకన చేస్తున్నారు. నిజమే మందు తెలంగాణ సంస్కృతిలో భాగమే. కానీ తెలంగాణ సంస్కృతి అంతా మందే కాదు కదా..? ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా దావత్ చేసుకుంటారు. కానీ ఈ మధ్య వస్తోన్న కొన్ని తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో తెలంగాణ వాళ్లు అంటే మందుకు బానిసలు, ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టుగా చూపిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మేమ్ ఫేమస్ నుంచి ఈ శుక్రవారం విడుదలైన పరేషాన్ వంటి చిత్రాలు చూస్తే ఈ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ మందు కనిపిస్తుంటే.. ఇతర ప్రాంతాల వారు ఎలా అర్థం చేసుకుంటారు. అంతెందుకు.. మందుకు బానిస కాని తెలంగాణ యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించాలి అనిపిస్తుంది.


జాతి రత్నాలు, బలగం వంటి చిత్రాల్లో కూడా మందు కనిపిస్తుంది. కానీ అది సందర్భానుసారంగా ఉంటుంది. అది సంస్కృతికి కొంత ప్రతీకగా ఉంటుంది. కానీ తెలంగాణ అంటే మందు తాగుడు తప్ప మరోటి లేదు అని చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. తిరువీర్ ప్రధాన పాత్రలో వచ్చిన పరేషాన్ సినిమాలో కథానాయకుడు 50వేలు సంపాదించాలి అనే లక్ష్యంతో ఉంటాడు. అందుకోసం ఏకంగా రెండు లక్షలకు పైగా మద్యాన్ని వెండితెరపై పారించాడు దర్శకుడు. ఇది తెలంగాణ సంస్కృతి ఎలా అయిందో అతను చెప్పాల్సి ఉంది..? ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు.

ఈ మధ్య వస్తోన్న తెలంగాణ యువత నేపథ్యం ఉన్న సినిమాలన్నీ కేవలం మద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ఇక్కడి కథలకు, గాథలకు కాదు. అంతెందుకు ఏదో విజయం సాధించాం అని చెప్పుకున్న దసరా సినిమా అంతా పారింది మద్యమే కదా..? అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం కూడా ఖచ్చితంగా తెలంగాణ సినిమా ప్రమాదంలోకి, తప్పుడు మార్గంలోకి వెళుతోంది అనేందుకు సూచిక అని చెబితే అతిశయోక్తి ఏం కాదు.నిజంగా వారు చూపిస్తోన్న మందు, మటన్ వంటి విషయాలు చూస్తే.. ఒకప్పుడు ఆంధ్రోళ్లే నయం.. కనీసం చిన్న పాత్రలతో అవమానించారు. వీళ్లు సినిమా మొత్తంగా అవమానిస్తున్నారు అనిపిస్తే తప్పు కాదు. ఆ స్థాయిలో దిగజారుడు సన్నివేశాలు.. వెండితెరంతా మద్యం పారిస్తూ.. ఆఖరికి అప్పుడే టీనేజ్ దాటిన కూర్రాళ్లు కూడా దీనికి బానిసలే అని చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం.

నిజానికి తెలంగాణ అంటే పోరాటం. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఈ గడ్డకు ఒక అస్తిత్వం ఉంది. అనేక పోరాటల చరిత్ర ఉంది. ఆ చరిత్రను తవ్వి తీస్తే ఊరికో బాహుబలి లాంటి కథ అవుతుంది. ఈ పోరాటాలను సరిగ్గా అధ్యయనం చేసి తీస్తే.. ప్రపంచ సినిమాల్లో వచ్చిన ఏ కథకు తక్కువగా ఉంటుంది..? ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సరిగ్గా తీస్తే.. దాని ముందు ఎన్ని బెన్ హర్ లు, ఎన్ని గ్లాడియేటర్లు సమానం అవుతాయి.ఏదేమైనా ఈ మధ్య కొంతమంది తెలంగాణ వాళ్లే.. తెలంగాణ గురించిన సినిమాలు చూస్తోంటే.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి కూడా అవమానంతో తల దించుకుని నా తెలంగాణ సినిమా తాగుబోతుల కోన అనక మానడు.

Telugu 70mm

Recent Posts

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

2 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

2 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

2 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

3 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

8 hours ago

Manchu Manoj Enters The World Of ‘Mirai’

Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…

8 hours ago