విఐ ఆనంద్‌ బర్త్‌డే స్పెషల్‌.. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్

రీసెంట్ గా ఊరిపేరు భైరవకోన తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్‌ విఐ ఆనంద్. సందీప్‌ కిషన్‌, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ మెయిన్ లీడ్‌తో వచ్చిన ఈ సినిమాకు టాక్‌ తో పాటు కలెక్షన్లు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. అయితే ఇదే టీమ్‌తో మరో సినిమా రాబోతుంది. విఐ ఆనంద్‌ బర్త్‌డే సందర్భంగా నెక్ట్ష్‌ ప్రాజెక్ట్‌ ను అనౌన్స్ చేసారు.


రాజేష్ దండా, అజయ్ సుంకర సహ నిర్మాతలుగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి కొత్త సినిమాకు కూడా పని చేయనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఏ టీవీ సమర్పిస్తోంది.
ఆర్టిస్ట్‌లు, టెక్నిషియన్స్‌ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

Related Posts