డిటెక్టివ్‌ సినిమాలో భూతద్దం భాస్కర్‌నారాయణ్‌ డిఫరెంట్

డిటెక్టివ్‌ ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ని ఆడియెన్స్‌ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్ ఉంటే బ్లాక్‌బస్టర్‌ రేంజ్‌ అందుకోవడానికి చాలా స్కోప్ ఉన్న సినిమాలివి. అదే కోవలో వస్తున్న మూవీ భూతద్దం భాస్కర్‌నారాయణ. పురుషోత్తం రాజు డైరెక్షన్‌లో స్నేహాల్‌, శశిధర్ ,కార్తీక్‌లు కలిసి నిర్మించిన మూవీ ఇది. ఇందులో శివ కందుకూరి హీరోగా నటించారు. రీసెంట్‌ గా రిలీజయిన ట్రైలర్‌కు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 1 న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్నేహాల్‌, శశిధర్‌లు మీడియాతో ముచ్చటించారు.
తమ సినిమా జర్నీ గురించి చెప్తూ.. మొదట షీష్‌మహాల్ అనే ఇండిపెండెంట్ సినిమా తర్వాత నీతో అనే మూవీతో నిలదొక్కుంటూ ఇప్పుడు భూతద్దం భాస్కర్‌నారాయణతో సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే క్రైమ్‌ థ్రిల్లర్ ని రూపొందించామన్నారు.
డిటెక్టివ్ కథను పురాణాలతో ముడిపెట్టి తీసిన విధానం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటుందన్నారు ప్రొడ్యూసర్స్.


రెగ్యులర్ డిటెక్టివ్ పాత్రలకు, ఈ మూవీలో డిటెక్టివ్‌కు చాలా తేడా ఉంటుందన్నారు. శివ కందుకూరి హీరోగా రాశిసింగ్ ఫిమేల్‌ లీడ్ చేసారు. వీరి వర్క్‌ డెడికేషన్ సూపర్బ్ అంటూ మెచ్చుకున్నారు.
ఈ సినిమా బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువే అయ్యిందన్నారు. అయితే సినిమా క్వాలిటీ విషయం కాబట్టి వెనుకాడలేదన్నారు ఆల్‌రెడీ ఓవర్సీస్‌, ఓటీటీ బిజినెస్‌ పూర్తయ్యిందన్నారు. ప్రతీ ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటుంది.. దాని వెనుకో కథ ఉంటుంది.. ఇలాంటి పాయింట్‌కి ఓ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేసి గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్‌ పురుషోత్తమ్‌ రాజ్ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.
శివట్రాన్స్‌ ట్రాప్ లిరికల్ వీడియో కోసం ఏఐ వర్క్ వాడామన్నారు. శ్రీ చరణ్‌ పాకాల అద్భుతమైన మ్యూజిక్ అందించాన్నారు.


కొత్త ప్రాజెక్ట్స్‌ గురించి చెప్తూ.. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల్లో వున్నాయి. ప్రస్తుతం మా ద్రుష్టి ఈ సినిమా విడుదలపైనే వుందన్నారు నిర్మాతలు శశిధర్‌, స్నేహాల్‌లు

Related Posts