వరుణ్‌తేజ్‌ ఛీఫ్‌ గెస్ట్‌గా ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా’ ప్రీరిలీజ్ ఈవెంట్

మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా నీలో అంటూ పాపులర్ అయిన అభినవ్ గోమఠం.. అదే టైటిల్‌తో రాబోతున్న మూవీతో హీరోగా మారాడు. అభినవ్‌ తో పాటు ఆలీరెజా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో వైశాలి రాజ్‌ హీరోయిన్‌. తిరుపతిరావు ఇండ్ల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీని కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి నిర్మించారు. ఫిబ్రవరి 23 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. వరుణ్‌ తేజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


అభినవ్‌లో చాలా షేడ్స్ ఉన్నాయ్‌.. ఈ మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా మూవీతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు చీఫ్‌ గెస్ట్‌ హీరో వరుణ్‌తేజ్‌. ఈ చిత్రం విజ‌యం సాధించి చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కూడా మంచి బ్రేక్ రావాల‌ని ఆశిస్తున్నాను* అన్నారు.
వరుణ్‌ తేజ్ రావడం చాలా సంతోషమన్నారు అభినవ్ గోమఠం. ఈ సినిమా కోసం టీమ్ అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో స్పెష‌ల్‌. ఈ సినిమా కోసం నా కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ సినిమాలో న‌టించ‌డం ల‌క్కీగా ఫీల‌వ‌తున్నాను. ఈ క‌థ నచ్చి ఈ సినిమా చేశాను. నా సినిమా కంటెంట్ చూడండి. మీకు న‌చ్చితే సినిమా చూడండి. త‌ప్ప‌కుండా అంద‌రి అభిమానంతో సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నాను అన్నారు అభినవ్.
ఇతర నటీనటులు, దర్శక నిర్మాతలు, అతిధులు సినిమా సక్సెస్‌ పట్ల నమ్మకాన్ని, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌ను ప్రశంసించారు.

Related Posts