‘వెయ్‌ దరువెయ్‌ ‘ ప్రీరిలీజ్‌ ఈవెంట్ – బిగ్‌టికెట్ లాంచ్‌

వెయ్‌ దరువెయ్‌.. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా చేస్తున్న మూవీ ఇది. యషా శివకుమార్‌, హెబా పటేల్‌ ఫిమేల్ లీడ్ చేస్తున్న మూవీ ఇది. నవీన్ రెడ్డి డైరెక్షన్‌లో దేవరాజ్ పోతూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 15 న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రిరిలీజ్‌తో ఈవెంట్‌ జరిగింది. బిగ్‌ టిక్కెట్‌ను ఆర్‌ నారాయణమూర్తి, నక్కిన త్రినాధరావు లు లాంచ్ చేసారు.
వెయ్ దరువెయ్ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నవీన్ రెడ్డిగారికి థాంక్స్. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే నాకు అండగా నిలబడ్డారు. ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమాలాగా అందరికీ అనిపిస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనకు మన బంధువులు అందరూ గుర్తుకొస్తారన్నారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో.‘భీమ్స్‌గారితో చాలా రోజులు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. చక్కటి మ్యూజిక్ అందించారు. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారికి, కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల సహా టీమ్ కు థాంక్స్. సాయిరామ్ గారు ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డౌన్ టు వర్త్ పర్సన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి మాతోనే ఉన్నారు. నిర్మాతగా నాకు ‘వెయ్ దరువెయ్’ రెండో చిత్రం. మార్చి 15న రిలీజ్ అవుతుంది. కచ్చితంగా సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత దేవరాజ్‌ పోతూరు.

మా నిర్మాత దేవరాజ్ గారు చాలా సపోర్ట్ చేశారు. 34 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాం. సాయిరామ్ గారు లేకపోతే ఈ మూవీ లేదు. భీమ్స్ గారు చాలా మంచి ఫ్రెండ్. ఒక్కో పాటకు మూడు నాలుగు ట్యూన్స్ ఇచ్చారు. ధమాకాను మించి రీరికార్డింగ్ ఇచ్చారు. మా హీరోయిన్ చాలా సపోర్ట్ అందించారు. సత్యం రాజేష్, సునీల్, రఘన్న సహా అందరూ సపోర్ట్ చేశారు. మూడు వందలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు డైరెక్టర్‌ నవీన్ రెడ్డి.

మా బాబాయ్ సాయిరామ్ గురించి చెప్పాలంటే, తనలోని ఎనర్జీ ఎక్కడా చూడలేదు. బంపర్ ఆఫర్ లో ఎనర్జీని చక్కగా చూపించారు. దానికి డబుల్ ఎనర్జీని ఈ సినిమాలో చూస్తారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. దేవరాజ్ గారికి ఇది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు ఆకాశ్‌ పూరి.

దర్శకుడు నవీన్ కథ చెప్పగానే నచ్చింది. నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతూనే మంచి పాయింట్ తో కథ రాసుకున్నారనిపించింది. అందుకనే చేయటానికి ఓకే చెప్పేశాను. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దేవరాజ్‌గారికి థాంక్స్. భీమ్స్ గారు మంచి సాంగ్స్ తో పాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఉద్ధవ్ లతో మంచి అనుబంధం ఉంది. నాకోసం ఎంటైర్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసిందన్నారు సాయిరామ్‌ శంకర్‌.

సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వ్యక్తి. నవీన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయటం గొప్ప విషయం. నిర్మాత దేవరాజ్ బాగుండాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసిన నవీన్ గారికి థాంక్స్. నిర్మాత దేవరాజ్ పోతూరుగారికి ఆల్ ది బెస్ట్. కె.జి.యఫ్ తో యష్ ఎంత పెద్ద స్టార్ అయ్యారో, ఈ సినిమాతో హీరోయిన్ యష పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు భీమ్స్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారన్నారు పీపుల్స్‌స్టార్ ఆర్‌.నారాయణమూర్తి.


మిగతా అతిధులు, నటీనటులు, చిత్ర యూనిట్ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts