అల్లు అర్జున్-అట్లీ కాంబోపై ఆరోజే రానున్న క్లారిటీ

ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల వైజాగ్ లో రెండు రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ టీమ్.. మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ తాహిర్ స్టూడియోలోచిత్రీకరణ జరుపుకోనుంది. ఇక మరికొన్ని రోజుల్లో ‘పుష్ప 2’ నుంచి ఫ్రీ అవ్వబోతున్న బన్నీ ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే.. వాటిలో ఏది ముందుగా పట్టాలెక్కుతుందనేదే ఫ్యాన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది.

అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మరొక చిత్రాన్ని ప్రకటించాడు. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడట. అయితే.. వీటిలో సందీప్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ప్రభాస్ తో ‘స్పిరిట్’ పూర్తైన తర్వాత బన్నీతో ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తాడు సందీప్. మరోవైపు త్రివిక్రమ్, అట్లీ చిత్రాలలో ఏది ముందు పట్టాలెక్కుతుంది అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.

ఆ సస్పెన్స్ కి ఏప్రిల్ 8న అంటే అల్లు అర్జున్ పుట్టినరోజున తెరదించబోతున్నారట. అల్లు అర్జున్ నటించే చిత్రాలలో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కబోతుందనే దానిపై ఏప్రిల్ 8న క్లారిటీ రానుందట.

Related Posts