‘ ఫైటర్‌ రాజా ‘ ఓపెనింగ్‌కు ‘ ఓం భీమ్‌ బుష్’ టీమ్‌

‘ఫైటర్‌ రాజా ‘ … ఈ క్యాచీ టైటిల్‌తో సినిమా గ్రాండ్ ఓపెనింగ్ జరుపుకుంది. రన్‌వే ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ నెంబర్‌ 2 గా ప్రారంభమైన ఈ చిత్రానికి కృష్ణ ప్రసాద్‌ డైరెక్షన్‌ చేస్తున్నారు. రామ్, మాయా కృష్ణన్ మెయిన్‌ లీడ్ చేస్తున్నారు. మెయిన్‌లీడ్‌తో పాటు తనికెళ్ల భరణి గన్స్‌ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను లాంచ్‌ చేసారు. టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కు ‘ఓం భీమ్ బుష్’ టీం హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హాజరయ్యారు అండ్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ కూడా మంచి పేరుతీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ తెలిపారు శ్రీ విష్ణు.

ఈ కథ గురించి నాకు తెలుసు. చాలా మంచి కథ. సినిమాలో పనిచేసే స్టంట్ మెన్ కి మంచి ట్రిబ్యుట్ లాంటి కథ. రామ్ కి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. పోస్టర్ లో తనికెళ్ళ భరణి గారిని చూసినప్పుడు శివ సినిమా గుర్తుకు వచ్చింది” అన్నారు ప్రియదర్శి.
రామ్ ఎప్పటినుంచో పరిచయం. ఇప్పుడు ఫైటర్ రాజా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పోస్టర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అన్నారు రాహుల్ రామకృష్ణ.
నన్ను నమ్మి నా వెంటే వున్న రామ్, దినేష్ కి ధన్యవాదాలు. చాలా మంచి నటీనటులుతో చేస్తున్న సినిమా ఇది అన్నారు దర్శకుడు చైతన్య కృష్ణ.
ప్యాషన్ డిజైనర్ గా పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాను. పచ్చీస్ నటుడిగా నా మొదటి సినిమా. కోవిడ్ కారణంగా ఓటీటీలో విడుదలైయింది. కానీ ఫైటర్ రాజా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇందులో అన్ని ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండా విజల్స్ పడతాయి. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసే సినిమా ఇది అన్నారు హీరో రామ్‌.


ఫైటర్ రాజాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు హీరోయిన్‌ మాయా.

Related Posts