వెన్నెల కిశోర్ కూడా హీరో అయ్యాడు

కమెడియన్స్ హీరోలు కావడం తెలుగు సినిమాలో ఎప్పటి నుంచో ఉంది. కొందరు సీరియస్ రోల్స్ తో మెప్పిస్తే మరికొందరు కామెడీ ఇమేజ్ తోనే హీరోలుగా రాణించారు. ఈ లిస్ట్ లో చివరగా ఎక్కువ సినిమాలు చేసిన కమెడియన్ టర్న్డ్ హీరో సునిల్.

కమెడియన్ గా టాప్ ప్లేస్ లో కొనసాగిన సునిల్.. తర్వాత హీరోగా మారాడు. కొన్నాళ్లు ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక కమెడియన్ నుంచి దర్శకుడుగా రాణించే ప్రయత్నం చేసిన నటుడు వెన్నెల కిశోర్.

తనకు నటుడుగా జన్మనిచ్చిన వెన్నెల సినిమాకు సీక్వెల్ గా వెన్నెల ఒన్ అండ్ హాఫ్‌ అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. ఇది ఏ మాత్రం ఆకట్టుకోలేదు. అటుపై బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘జఫ్ఫా’ అనే సినిమా రూపొందించాడు. ఇదీ పోయింది. దీంతో ఇక దర్శకత్వానికి కామా పెట్టి కమెడియన్ గానే కంటిన్యూ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం ఆయన్ని హీరోగా అవకాశం వస్తే చేస్తారా అని అడిగితే నో అన్నాడు. బట్ ఆ మాటకు కట్టుబడలేదు. అతను హీరోగా మారాడు. కాకపోతే ఇది కామెడీ సినిమా అని లేటెస్ట్ గా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్థం అవుతుంది.


వెన్నెల కిశోర్ హీరోగా ”చారి 111″ అనే సినిమా రూపొందుతోంది. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలోని డైలాగ్స్ అన్నీ ఫన్నీగా ఉన్నాయి. కొన్ని పాత్రలను పరిచయం చేస్తూ వెన్నెల కిశోర్ క్యారెక్టరైజేషన్ ఎంత బ్యాడ్ లక్ తో ఉంటుందో తెలియజేశారు. అది చూస్తే ఈ మూవీ కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోందన్న విషయం అర్థం అవుతుంది.

వీళ్లు ఈ మూవీని ఫన్ ఫిల్డ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. వెన్నెల కిశోర్ సరసన సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్ర చేస్తున్నాడని చెప్పారు. బర్కత్ స్టూడియోస్ సమర్పణలో అదితి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి టిజి కీర్తి కుమార్ దర్శకుడు. షూటింగ్ స్టార్ట్ అయిందట. మరిన్ని వివరాలు త్వరలోనే వస్తాయేమో.

Related Posts