గాండీవధారి అర్జునలో హైలెట్స్ ఏంటీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్‌ మేకర్ ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి.

హాలీవుడ్ రేంజ్ మూవీలా కనిపిస్తోంది. అఫ్‌ కోర్స్ ఇది ఇండియాకు సంబంధించిన కథ కాదు. కంటెంట్ తో పాటు షూటింగ్ మొత్తం విదేశాల్లోనే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఓ మంచి మెసేజ్ తో పాటు అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించామని పదే పదే చెబుతూ వస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. అటు వరుణ్ తేజ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడీ మూవీపై.

అయితే ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ హైలెట్స్ ఏంటీ అనే ఆరాలు మొదలయ్యాయి. మెయిన్ హైలెట్ కథే అనేది రొటీన్ డైలాగ్. ఆ కథలోనే కొన్ని హైలెట్స్ ఏంటీ అంటే.. వరుణ్ తేజ్ ఎంట్రీ ఫస్ట్ హైలెట్ గా ఉంటుందంటున్నారు. జేమ్స్ బాండ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్ తో అతని ఎంట్రీ ఉంటుందట. అసలు కథలోకి వెళ్లిన తర్వాత తను సైన్ చేసిన ఓ కాంట్రాక్ట్ కోసం అతను ఎక్స్ ట్రీమ్ లెవల్ కు వెళ్లడంలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.

ఇక చాలా రోజుల తర్వాత హీరోయిన్ కు బలమైన క్యారెక్టరైజేషన్ ఉంటుందట. తన పాత్రే సినిమాలో హైలెట్ అంటున్నారు. మరో ఎసెట్ నాజర్ పాత్ర. ఇప్పటి వరకూ నాజర్ ఈ తరహా పాత్రలు చేసి ఉన్నా.. ఇదే హైలెట్ అనేలా ఆయన పాత్ర ఉంటుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా ఓ రేంజ్ లో పరుగులు పెడుతుందంటున్నారు. ఇవన్నీ వింటుంటే.. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది అర్థం అవుతుంది.

ఇలాంటి సినిమాల్లో పాటలు లేకపోవడం చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. ఈ విషయంలో గాండీవధారి ఆ ప్లస్ పాయింట్ తోనే వస్తోంది. రెండు మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. అది కూడా కథానుసారంగానే ఉంటుంది తప్ప.. స్క్రీన్ ప్లే ఫ్లోను డిస్ట్రబ్ చేయదు అంటున్నారు. మొత్తంగా ఓ ఆల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తోన్న గాండీవధారి అర్జున ఖచ్చితంగా ఆకట్టుకుంటుందంటున్నారు.

Related Posts