ఖుషీ మూవీ సెన్సార్ టాక్ ఎలా ఉంది..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. టక్ జగదీష్ తర్వాత శివ నిర్వాణ రూపొందించిన సినిమా ఇది. అంతకు ముందు అతను చేసిన నిన్నుకోరి, మజిలీ వంటి సినిమాలు సెన్సిబుల్ హిట్స్ గా నిలిచాయి. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే వస్తుందని చెబుతున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ అయింది. సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే సెన్సార్ నుంచి ఈ చిత్రానికి డిఫరెంట్ టాక్ వినిపిస్తోంది. అంటే బాలేదు అని కాదు. మరి వాళ్లు ఏం చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖుషీ సినిమా కథ ఎలా ఉంటుందంటే..


విప్లవ్(విజయ్ దేవరకొండ) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఓ ప్రాజెక్ట్ పనిపై కశ్మీర్ కు వెళతాడు. అక్కడ అతనికి బేగమ్(సమంత) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు విప్లవ్. అందుకోసం తన చుట్టూ తిరుగుతూ తన ఇష్టాయిష్టాలు తెలుసుకుంటాడు. మొదట విప్లవ్ కు దూరంగా ఉన్నా.. తర్వాత బేగమ్ కూడా అతనితో ప్రేమలో పడుతుంది. అయితే తను బేగమ్ ను కాదని.. బ్రాహ్మణుల అమ్మాయిని అని.. పేరు ఆరాధ్య అని మొదటి సర్ ప్రైజ్ ఇస్తుంది విప్లవ్ కి. తర్వాత కథ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది.

ఇద్దరి కుటుంబాల మతాలు, ఆలోచనలూ వేర్వేరు. దీంతో పెద్దలు పెళ్లిక ఒప్పుకోరు. అయినా వారిని ఎదురించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లయ్యాక కొంత కాలం బానే ఉన్నా.. ఇద్దరి మధ్య మెల్లగా అభిప్రాయ భేదాలు మొదలవుతాయి. ఇవి వారి మధ్య పూడ్చలేనంత దూరాన్ని పెంచుతాయి. దీంతో విడిపోదాం అనే నిర్ణయానికి కూడా వస్తారు. మరి వాళ్లు విడిపోయారా..? అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది.ఇందుకు ఇద్దరిలో ఎవరు కారణం అనేది మిగతా కథగా చెబుతున్నారు. నిజానికి ఈ కథంతా ట్రైలర్ లో కనిపించిందే. అయితే కథనం మాత్రం మూడు దశలుగా సాగుతుందట.


కశ్మీర్ లో సాగే కథనంలో ఫ్రెష్ లవ్ స్టోరీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుందట. వారి ప్రేమ ఓకే అయిన తర్వాత ఫ్యామిలీ డ్రామా చాలా సినిమాల్లో చూసిందే కనిపిస్తుందట. అయినా పెళ్లి చేసుకుంటారు కదా.. ట్రైలర్ లో చెప్పినట్టు భార్యంటే ఎలా ఉండాలో, భర్తంటే ఎలా ఉండాలో చూపిస్తా అని చెప్పుకున్నా.. పెళ్లి తర్వాత ప్రేమ స్థానంలో బాధ్యతలు మొదలవుతాయి. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి. మరోవైపు ప్రేమించినప్పుడు ఆడవాళ్లపై చూపించే ప్రేమ పెళ్లి తర్వాత ఎందుకు కనిపించదు అనే కోణంలో సాగ చర్చే ఈ సినిమాకు ప్రధాన బలం అంటున్నారు. అది కనెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది. లేదంటే తేడాలొస్తాయనే టాక్ ఉంది.

లవ్ సక్సెస్ అయిన తర్వాత ఇది నా పిల్లే కదా అని అబ్బాయిలు లైట్ తీసుకుంటారు. కానీ అమ్మాయిలు అంతకు మించిన ప్రేమను ఎక్స్ పెక్ట్ చేస్తారు. అతను నాకే సొంతం అనే క్రమంలో కాస్త ఓవర్ గా బిహేవ్ చేస్తారు. దాన్ని అబ్బాయిలు సీరియస్ గా తీసుకుంటే ఇద్దరి మధ్య మనస్ఫర్థలే పెరుగుతాయి. అలా కాకుండా ఒకరిని అర్థం చేసుకుంటే జీవితాంతం ఖుషీగా ఉంటారు అనే సందశంతో మిళితమైన సెకండ్ హాఫ్‌ సినిమాకు కీలకంగా ఉంటుందట. మరి ఈ క్లాస్ లు, సందేశాలు ఈ తరం ప్రేక్షకులు ఇష్టపడతారా అనే చర్చే అవసరం లేదు. ఏ కథైనా ఆకట్టుకునేలా చెబితే.. ఆ క్లాస్ లను ఆడియన్స్ కూడా శ్రద్ధగానే చూస్తారు. ఎటొచ్చీ ఆ ఇంట్రెస్టింగ్ నెరేషనే కీలకం.

Related Posts