టాలీవుడ్

వీరుడు మహా బోర్ అంటగా

శివకార్తికేయన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఓ మంచి కథతోనే వస్తాడు అని నమ్ముతారు తమిళ్ ప్రేక్షకులు. వారిలో అతనిపై ఉన్న నమ్మకం అలాంటిది. అతని ఇమేజ్ కూడా అలాంటిదే. చిన్న స్థాయి నుంచిపెద్ద హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. అందుకే అతనంటే చాలామందికి అభిమానం. అయితే కొన్నాళ్లుగా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో వచ్చిన రెమో, డాక్టర్ వరుణ్‌ వంటి సినిమలు ఓకే అనిపించుకున్నాయి. కానీ అతనికి ఇక్కడ ఇమేజ్ తెచ్చేంత పెద్ద సినిమాలైతే కాదు. కాకపోతే అతని సినిమాలను కొన్నాళ్లుగా ఓటిటిలో చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.రీసెట్ గా ప్రిన్స్ అనే డైరెక్ట్ మూవీతో పలకరించాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ రూపొందించినీ సినిమా పోయింది. అయినాఇప్పుడు మహా వీరుడు అంటూ తన తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేశాడు.


ఈ శుక్రవారం మహావీరుడు సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే ఉదయం ఆట పడలేదు ఈ మూవీ. టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ప్రసాద్ ఐమాక్స్ లో ఉదయం 9గంటలకు పడాల్సిన షో క్యాన్సిల్ అయింది. తర్వాత 11. 45కి వేశారు. శివకార్తికేయన్ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ సినిమా చూసిన వారికి షాక్ ఇచ్చాడు మహా వీరుడు.

అస్సలే మాత్రం బలంగా లేని కంటెంట్.. బలహీనమైన కథనంతో ఓ రేంజ్ లోబోర్ కొట్టించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ చూస్తుంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. కొందరైతే మధ్యలోనే పారిపోయారు కూడా.


ఓ పిరికివాడు.. తన భయాన్ని జయించి ఓ పెద్ద వ్యక్తిని ఢీ కొట్టడం అనే పాయింట్ తో వచ్చిందీ చిత్రం. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎప్పుడో వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు హీరోలుగా చేస్తున్నప్పుడే ఇది మన దగ్గర అరిగిపోయిన రికార్డ్. అలాంటి సినిమా మళ్లీ చూడాలంటే ఈ తరానికి తగ్గట్టుగా ఓ కొత్తదనం ఉండాలి. బట్ ఈ మహా వీరుడులో అలాంటి కొత్తదనం ఏం కనిపించలేదు. దీంతో చూసిన వారంతా ముక్త కంఠంతో మహా వీరుడు కాదు.. మహా బోరుడు.. అంటున్నారు.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

4 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

8 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

8 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

10 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

12 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

14 hours ago