వరుణ్ తేజ్ వర్క్ షాప్ మొదలైంది..

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. క్లాస్ తో పాటు మాస్ లోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే గద్దలకొండ గణేష్ తర్వాత సరైన విజయాలు పడలేదు. చివరగా వచ్చిన గని తీవ్రంగా నిరాశపరిచింది.

ఈ నెల 25న ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్ లో రూపొందిన ‘గాండీవధారి అర్జున’ అనే సినిమాతో వస్తున్నాడు.ఈ సినిమాలో అతను ఓ స్పెషల్ ఏజెన్సీలో పనిచేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మరోవైపు ఆపరేషన్ వాలైంటైన్ అనే సినిమా చేస్తున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంతో అల్లుకున్న ఈ మూవీలో వరుణ్ పైలెట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజ్ లో ఉన్న ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల కాబోతోంది. మరోవైపు రీసెంట్ గా పలాస దర్శకుడు కరుణకుమార్ తో మరో సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమా పేరు మట్కా.


మట్కా సినిమా వైజాగ్ నేపథ్యంలో 1958- 1982 మధ్య కాలంలో సాగే కథగా రూపొందుతోంది. మరీ ఈ రేంజ్ పీరియాడిక్ డ్రామా తెలుగులో రాలేదు. అందువల్ల ఈ మూవీపై మంచి ఆసక్తి ఉంది. వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాడు దర్శకుడు కరుణ కుమార్. ఈ వర్క్ షాప్ కు ముంబై నుంచి నోరా ఫతేహీని ప్రత్యేకంగా రప్పించారు. ఈ చిత్రంలో తన లుక్ తో పాటు క్యారెక్టర్ కు సంబంధించిన డీటెయిల్స్ ను ఫైనల్ చేయబోతున్నారు. ఈ మేరకు నోరా వర్క్ షాప్ లో జాయిన్ అయింది. పీరియాడిక్ డ్రామా కాబట్టి.. ఆ కాలంలోని వ్యక్తుల బాడీ లాంగ్వేజ్, కాస్టూమ్స్, హెయిర్ స్టైల్, సెట్ ప్రాపర్టీస్.. ఇలాంటి అన్ని అంశాలపైనా ఇలాంటి వర్క్‌ షాప్స్ ద్వారా ప్రీ ప్రొడక్షన్ ను ఫైనల్ చేసుకుంటారన్నమాట. మరి పలాస తర్వాత వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం సినిమాలతో డిజాస్టర్స్ చూశాడు కరుణ కుమార్. మళ్లీ ఈ పీరియాడిక్ మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Related Posts