రజినీకాంత్ సినిమాలో శర్వానంద్

జైలర్ బ్లాక్ బస్టర్ తో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు రజినీకాంత్. ప్రస్తుతం తన పాత మిత్రులతో కలిసి ఉత్తర భారతంలో ఆధ్మాత్మిక యాత్రలో ఉన్నాడు రజినీకాంత్. తర్వాత ఆయన చేయబోయే సినిమా ఓ మల్టీస్టారర్. జై భీమ్ మూవీతో దేశవ్యాప్తంగా గొప్ప ఇంపాక్ట్ చూపించిన టిజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో రజినీకాంత్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు.

ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి దాదాపు 32యేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండగా హమ్, అంధా కానూన్, గిరఫ్తార్ వంటి బ్లాక్ బస్టర్స్ లో కలిసి నటించారు. అప్పుడు అవి బాలీవుడ్ సినిమాలు. ఇక ఫస్ట్ టైమ్ అమితాబ్ స్ట్రెయిట్ తమిళ్ మూవీ చేయబోతున్నాడు.

ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను తెలుగు స్టార్ శర్వానంద్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. ఇది కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న సినిమా కావడంతో ఈ సీనియర్స్ మల్టీస్టారర్ పై ఓ స్పెషల్ ఫోకస్ కనిపిస్తోంది. ఆ ఫోకస్ లోకి ఆటో మేటిక్ గా శర్వానంద్ కూడా చేరిపోతాడు. అయితే ప్రస్తుతం శర్వానంద్ తో చర్చలు నడుస్తున్నాయి. ఇంకా అతను పూర్తిగా అంగీకారం తెలపలేదు. బట్ సినిమాలో శర్వా చేసే పాత్ర చాలా ముఖ్యమైనది అంటున్నారు.


ఇక ఈ మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న సినిమా అని తెలుస్తోంది. ఈ మూవీలో రజినీకాంత్ ముస్లీం పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. అంటే సెన్సిటివ్ ఇష్యూస్ నేపథ్యంలోనే కథ ఉంటుందనుకోవచ్చు. రజినీకాంత్ 170వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ న్యూస్ త్వరలోనే రాబోతోంది.

Related Posts