ఇదుగో దేవర విలన్ ‘భైరా’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న దేవర సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో ప్యాన్ ఇండయన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే కంటెంట్ తోనే వస్తున్నాడని గతంలోనే చెప్పాడు. ప్యాన్ ఇండియన్ కలర్ కు తగ్గట్టుగానే ఈ చిత్రంలో విలన్ తో పాటు హీరోయిన్ ను కూడా బాలీవుడ్ నుంచే తీసుకున్నారు. విలన్ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇవాళ(బుధవారం) సైఫ్ బర్త్ డే. ఈ సందర్బంగా మూవీ నుంచి అతని లుక్ ను విడుదల చేసింది దేవర టీమ్.

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ “భైరా” అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అతని లుక్ తో పాటు సముద్రలో నాటు పడవలపై వెళుతున్న కొందరు మనుషులు కనిపిస్తున్నారు.
ఈ లుక్ లో సైఫ్ అలీఖాన్ మరీ అంత క్రూరమైన గెటప్ తో ఏం కనిపించడం లేదు. చూపుల్లో కానీ, డ్రెస్సింగ్ లో కానీ విలన్ అన్నంత కాఠిన్యం లేదు. ఇంకా చెబితే సడెన్ గా చూడగానే పాత మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ గెటప్ లా ఉంది. అదే కాస్త ఆశ్చర్యంగా ఉంది. మొత్తంగా దేవర టీమ్ తమ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలో ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. షూటింగ్ తో పాటు అప్డేట్స్ ను కూడా చాలా వేగంగానే అందిస్తోంది. ఏదేమైనా ఎన్టీఆర్ లుక్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇద్దరూ సమవుజ్జీలుగా ఉంటారని మాత్రం అనిపిస్తోంది.

మరి విలన్ బలవంతుడైతేనే కదా.. హీరో దమ్మేంటో తెలిసేది. ఏదేమైనా దేవర విలన్ భైరా అలియాస్ సైఫ్‌ అలీఖాన్ కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం..

Related Posts