డబుల్ డోస్ ఎంటర్ టైన్ మెంట్ తో ‘సేవ్ ద టైగర్స్ 2’

తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ లలో ‘సేవ్ ద టైగర్స్’ ముందు వరుసలో ఉంటుంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సేవ్ ద టైగర్స్’కి ఇప్పుడు సీక్వెల్ రెడీ అయ్యింది. ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, దర్శన బానిక్, హర్ష వర్థన్ సందడి చేయబోతున్నారు. లేటెస్ట్ గా ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ రిలీజయ్యింది.మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్ గా అరుణ్ కొత్తపల్లి తెరకెక్కించిన ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్ లా ఉంది.

వైవాహిక జీవితంలో విసిగిపోయిన భర్తలుగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ ఫ్రస్టేషన్ తో నవ్వించబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. భార్యలు కూడా తమ భర్తలకు బుద్ధి చెప్పే పనులు ట్రైలర్ లో అలరిస్తున్నాయి. మార్చి 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘సేవ్ ద టైగర్స్ 2’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.

Related Posts