ప్రభాస్ నుంచి మరో రెండు సినిమాలు

ప్రభాస్ దూకుడుకు టాలీవుడ్ కూడా షాక్ అవుతోంది. చాలా పెద్ద ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఉన్నా.. యేడాది కాలంలోనే రాధేశ్యామ్, ఆదిపురుష్‌ చిత్రాలతో వచ్చాడు. నెక్ట్స్ సలార్, ప్రాజెక్ట్ కే, సలార్2, రాజా డీలక్స్ అంటూ కంటిన్యూస్ గా సినిమాలున్నాయి. అయితే వీటిలో సలార్ కు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. ప్రాజెక్ట్ కే ఈ యేడాదితో పూర్తవుతుంది. అటు రాజా డీలక్స్ కూడా ఓ రెండు నెలలు టైమ్ ఇస్తే అయిపోతుంది. అంటే ఎలా చూసినా ఈ యేడాదితో తను ఇప్పుడు చేస్తోన్న సినిమాల షూటింగ్స్ అన్నీ అయిపోతాయి. సో.. 2024లో పూర్తిగా ఖాళీ అవుతాడు. మరి ఈ గ్యాప్ ను అప్పటికప్పుడు భర్తీ చేయలేరు కదా. అందుకే ఆల్రెడీ రెండు కథలు, ఇద్దరు దర్శకులకు ఓకే చెప్పాడు డార్లింగ్. వీటిలో ముందుగా వచ్చే సినిమా స్పిరిట్.


సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోతోన్న సినిమా స్పిరిట్. అతను ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 11నే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఒక పాట షూటింగ్ లేట్ అవడం వల్ల డిసెంబర్ 1కి వెళ్లిపోయారు. యానిమల్ తర్వాత సందీప్.. ప్రభాస్ తో చేసే స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరిలో అఫీషియల్ గా ప్రారంభం అవుతుందంటున్నారు. ఆ తర్వాత వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట.


ఇక సందీప్ తర్వాత సినిమా కూడా ఆల్రెడీ ఓకే చేసి ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఎక్కువ హైప్ లేకుండా చూస్తున్నారు. బట్ సీతారామంతో మెస్మరైజ్ చేసిన హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యాడట ప్రభాస్. అయితే హను చెప్పిన లైన్ అద్భుతంగా ఉన్నా.. ఇంకా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంది. ఈ కథకు సంబంధించి ఫైనల్ నెరేషన్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంటున్నారు. అయితే ఈ కథ ఇండియా, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుందట. ఇప్పటి వరకూ మనం చూడని కొన్ని కొత్త పాయింట్స్ నేపథ్యంలో ఈ కథను అల్లుకున్నాడట హను రాఘవపూడి. అది నచ్చడం వల్లే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే ఈ కథను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ప్రభాస్ ను శాటిస్ ఫై చేస్తే.. సందీప్ తర్వాతి సినిమా ఇదే అవుతుంది. సో.. డార్లింగ్ దూకుడు మామూలుగా లేదనే చెప్పాలి.

Related Posts