ప్రభాస్ కల్కిలో మరో ఇద్దరు హీరోలు..

ఇండియాస్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఫ్యూచర్ లో సాగే కథ కావడంతో పాటు నాగ్ అశ్విన్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతోంది కాబట్టి.. ఆ గ్రాండీయర్ ను ఎక్స్ పెక్ట్‌ చేయొచ్చు. హాలీవుడ్ తరహాలో మన పురాణాలను జోడించి.. మల్టీవర్స్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు.

చాలామంది ఇది ఫ్యూచర్ లో సాగే కథే అనుకుంటున్నా.. ఇదో టైమ్ ట్రావెల్ స్టోరీ అని ముందు నుంచీ హింట్ ఇస్తూనే ఉన్నారు. అంటే ఈ కాలం నుంచి మన సూపర్ హీరో ఫ్యూచర్ కు వెళతాడు అన్నమాట. అక్కడ వారికి ఎదురయ్యే సమస్యల నుంచి కాపాడతాడు అనే టాక్ కూడా ఉంది.ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ కాబట్టే.. ఆ విషయంలో 90ల్లోనే సంచలనాల సృష్టించిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సహాయం తీసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ తరహా అడ్వాన్స్ డ్ స్టోరీస్ ను సింగీతం దశాబ్దాల క్రితమే ప్రేక్షకులకు చూపించాడు. అందుకే ఆయన హెల్ప్ ఈ చిత్రానికి పెద్ద ఎసెట్ అవుతుందనే చెప్పాలి.


ఇక ఈ మూవీలో విలన్ గా కమల్ హాసన్ ను తీసుకున్నారు.. అన్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. బట్ కమల్ ఎంట్రీ వెనక ఉన్నది కూడా సింగీతం గారే. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు కమల్ హాసన్. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. హీరోయిన్ గా దీపికా పదుకోణ్ ఉంది. ఇప్పటికే ప్యాన్ వరల్డ్ కలర్ తో కనిపిస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఆల్రెడీ తను ఈ సినిమాలో ఉన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్. రీసెంట్ గా అతని కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. దుల్కర్ .. నాగ్ అశ్విన్ రెండో సినిమాలో నటించాడు. ఇక తన ఫస్ట్ హీరోను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది అంట.

నాని,నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం హీరో నానినే కదా. అప్పుడు ఆ కథను ఎవరూ నమ్మకపోతే నాని నమ్మాడు.నాని కూడా కల్కి లో ఓ చిన్న పాత్ర చేస్తున్నాడు అనే టాక్ బలంగా ఉంది. అయితే ఇది వేరే ఆర్టిస్టులు కూడా చేయదగిన పాత్రేనట. కానీ తన ఫస్ట్ అండ్ సెకండ్ హీరోస్ పై ఉన్న అభిమానంతోనే ఆ ఇద్దరినే ఈ పాత్రల్లో చూపించబోతున్నాడు అంటున్నారు. మొత్తంగా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడితో ఇండియన్ సినిమాలో పెద్ద పాథ్ బ్రేకింగ్ కనిపిస్తుందనేది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ.. ఖచ్చితంగా అది జరగాలనే కోరుకుందాం..

Related Posts