బాలయ్య కెరీర్ లో భగవంత్ దే టాప్ ప్లేస్

సీనియర్ హీరోలు ఈ మధ్య బాక్సాఫీస్ ను చితక్కొడుతున్నారు. ఒక్కో హీరో వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్, బాలకృష్ణలు మళ్లీ పూర్వ కాలంలోలాగా పోటీలు పడి మరీ అదరగొడుతున్నారు.అందుకే ఈ వయసులోనూ వీరి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. అటు దర్శకులు కూడా వీరితో సినిమాల చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇది చాలు.. వీరి రేంజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉందో తెలియడానికి. ఆ క్రేజ్ వల్లే వీరి సినిమాల బిజినెస్ లు కూడా భారీగానే ఉంటున్నాయి.

అఖండ, వీరసింహారెడ్డి అంటూ వరుస విజయాలతో మంచి జోష్ లోఉన్నాడు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి మూవీ చేస్తున్నాడు. బాలయ్య సరసన కాజల్అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీ లీల ఆయనకు కూతురు వరుస అయ్యే అమ్మాయిగా నటిస్తోంది.

అనిల్ రావిపూడి తన కంఫర్ట్ జోన్అయినా కామెడిని వదలకుండానే బాలయ్య శైలిలో యాక్షన్ మిక్స్ అయ్యేలా ఈ కథ రాసుకున్నాడట. ఆ మధ్య వచ్చిన చిన్న గ్లింప్స్ పెద్ద ఇంపాక్ట్ చూపించింది. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచీ ఫ్యాన్స్ లో ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. బాలయ్యే దసరా బుల్లోడు అవుతాడు అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రానికి ఇప్పటి వరకూ బాలయ్య కెరీర్ లోనే హయ్యొస్ట్ బిజినెస్ జరగడం విశేషం.


భగవంత్ కేసరిపై ముందు నుంచీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా అయింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 75 కోట్ల వరకూ అయింది. ఇంకా నాన్ థియేట్రికల్ బిజినెస్ కావాల్సి ఉంది. అంటే శాటిలైట్, ఓటిటి తో పాటు డబ్బింగ్ కూడా బిజినెస్ కావాల్సి ఉంది. బట్ థియేట్రికల్ గా చూస్తే బాలయ్య సినిమాకు 75 కోట్లు అనేది ఇప్పటి వరకూ హయ్యొస్ట్ అమౌంట్. అంతకు ముందు వచ్చిన వీరసింహారెడ్డి 70 కోట్ల వరకూ అయింది. అఖండకు 65 కోట్ల బిజినెస్ జరిగింది. వాటికి మించి కనిపిస్తోందంటే కాంబినేషన్ క్రేజ్ కూడా యాడ్ అయి ఉంటుంది. అనిల్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. చేసేది బాలయ్యతో కాబట్టి యాక్షన్ ఉంటుంది. వీటితో పాటు శ్రీ లీల ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అంటున్నారు. ఇవన్నీ కలిసొచ్చి భగవంత్ కేసరికి థియేట్రికల్ రైట్స్ కు రికార్డ్ ధర వచ్చింది. మరి నాన్ థియేట్రికల్స్ తో పాటు డబ్బింగ్ కు ఎంత వరకూ వస్తుందో.


కాకపోతే ఈ చిత్రానికి దాదాపు 100 కోట్ల బడ్జెట్ వరకూ పెడుతున్నారట. అది రికవర్ చేయాలంటే బాలయ్య మిరాకిల్ చేయాలి. పైగా ఆయనతో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో చిత్రాలున్నాయి. ఈ పోటీలో కూడా బాలయ్య సాధిస్తే.. అదీ ఓ రికార్డ్ అవుతుందేమో.

Related Posts