మాస్ మహరాజా దూకుడుకు టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. సినిమాల రిజల్ట్స్ తో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. పైగా ఒకేసారి రెండు మూడు సినిమాలు సెట్స్ లో ఉంటున్నాయి. మామూలుగా ఒక్క సినిమా సెట్ చేసుకోవడానికే చాలామంది హీరోలు నానా తంటాలు పడుతున్నారు. అలాంటిది రవితేజ ప్లానింగ్ దూకుడుగా కనిపిస్తోంది. కాకపోతే ఈ వేగంలో ఒక్కోసారి సినిమా అవుట్ పుట్ పై శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తోంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు పూర్తి చేసి ఉన్నాడు.
ఏవైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు. ఈ సినిమా దసరా బరిలో అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. అంతకు ముందు రోజు విజయ్ లియో తో పాటు అదే రోజు బాలకృష్ణ భగవంత్ కేసరి ఉంది. అయినా మాస్ రాజా మూవీ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే విడుదలవుతుంది. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇక ఈ మూవీతో పాటు షూటింగ్ చేసిన మరో సినిమా ఈగిల్. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తోన్న సినిమా ఇది. ఆ మధ్య వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ కూడా సూపర్బ్ అనిపించుకున్నాయి. అప్పుడే సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తాం అని ప్రకటించారు. నిజానికి అప్పుడు సంక్రాంతి బరిలో ప్రభాస్ కల్కి, మహేష్ బాబు గుంటూరు కారం వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అయినా రవితేజ వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఆ రెండు సినిమాలు డౌటే అంటున్నారు.
సో.. మాస్ రాజాకు తిరుగులేదు. అయితే ఈ మధ్య ఈగిల్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుంది.. సంక్రాంతికి రావడం కష్టమే అనే రూమర్స్ వచ్చాయి. బట్ అలాంటిదేం లేదు. ఇప్పటికే సినిమా దాదాపు పూర్తయింది. రవితేజ పోర్షన్ అయితే కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్యాచ్ వర్క్ కోసం త్వరలోనే లండన్ వెళుతున్నాడు. మరి హీరో వర్కే పూర్తయిందీ అంటే ఇక మిగతా షూటింగ్ బ్యాలన్స్ ఉండే అవకాశమే లేదు. సో.. ఈ మూవీ సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఏదేమైనా రెండు పెద్ద పండగలను కవర్ చేస్తున్నాడు రవితేజ.