కంగువా పై షాకింగ్ అప్డేట్

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ సూర్య సినిమా అంటే తెలుగులోనూ ఓ క్రేజ్ ఉంటుంది. ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు సూర్య. ఎంత స్టార్డమ్ ఉన్నా.. ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం ఆలోచించడు. అందుకే జై భీమ్, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలు చేయగలిగాడు.

సూర్య ఇప్పుడు కెరీర్లోనే ఫస్ట్ టైమ్ భారీ బడ్జెట్ మూవీతో వస్తున్నాడు. అదే కంగువ. ఈ మూవీ టైటిల్ నుంచి ఫస్ట్ లుక్ అనౌన్స్ అయినప్పుడే అందరూ ఓ రకమైన క్యూరియాసిటీతో చూశారు. ఇక అతని బర్త్ డే రోజు వచ్చిన గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించుకున్నాయి. ఈ గ్లింప్స్ లో సూర్య గెటప్ చూసిన తర్వాత ఇదో హిస్టారికల్ మూవీ అనుకున్నారు చాలామంది. అతని కటౌట్ కూడా అలాగే ఉంది. సో.. సినిమా అంతా రాజులు, రాజ్యాలు అంటూ ఉంటుంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు అని తెలుస్తోంది.


కంగువలో సూర్య ఐదు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక గెటప్ కు సంబంధించిన పార్ట్ మాత్రమే గ్లింప్స్ లో ఉందట. అంతేకాదు.. ఈ సినిమా ఇప్పుడు దేశంలో జరుగుతున్న అనేక కాంటెంపరరీ ఇష్యూస్ ను టచ్ చేస్తూ సాగుతుందట. ఈ గ్లింప్స్ లో కనిపించిన విజువల్స్ అన్నీ కథలో ఒక పార్ట్ లో కనిపించే సబ్ స్టోరీలో భాగంగా వస్తాయి.

అంటే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఎపిసోడ్ ఉంటుంది. అంతే తప్ప సినిమా అంతా అదే నేపథ్యంలో సాగదు అన్నమాట. ఆ ఐదు గెటప్స్ లో మిగతావన్నీ ఇప్పుడు జరుగుతున్న సామాజిక అంశాల్లో భాగంగానే కనిపిస్తాయట. లేదూ మరో గెటప్ మరో కాలంలో సాగేలా ఉంటుంది. అంతే తప్ప.. కంగువ అనేది కంటిన్యూస్ గా ఒకే నేపథ్యంలో సాగే సినిమా కాదు అని స్పష్టంగా చెబుతున్నారు. అంటే సూర్య గతంలో చేసిన సెవెంత్ సెన్స్ అనే సినిమాలా అన్నమాట.

అందులో ఒక సూర్య ఈ కాలంలోనే ఉంటాడు. మరో సూర్య పాత్ర బోధిధర్మ కాలంలో సాగుతుంది. అలా ఇందులోనూ ఒక పార్ట్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఎపిసోడ్ కనిపిస్తుందట. సో.. సూర్య చేస్తున్నది సోషల్ డ్రామానే అన్నమాట.


ఇక వరుస విజయాలతో దూసుకుపోతోన్న శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఇతను సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడయ్యాడు. తెలుగులో గోపీచంద్ తో శౌర్యం, శంఖం రవితేజతో దరువు సినిమాలు చేశాడు. తర్వాత కోలీవుడ్ విక్రమార్కుడు చిత్రాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అటుపై అజిత్ తో హ్యాట్రిక్ హిట్స్ తీశాడు. రజినీకాంత్ తో అన్నాత్తే మూవీ చేసినా ఆకట్టుకోలేదు. ఇప్పుడు సూర్యతో కంగువ చేస్తున్నాడు. అతనికి కూడా ఇదే ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ. మొత్తంగా కంగువ విషయంలో ఇప్పటి వరకూ వినిపించింది వేరు. అసలు సినిమా వేరు అన్నమాట.

Related Posts