పవన్ కోసం త్రివిక్రమ్ వస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది. ట్రైలర్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ వస్తున్నాడు. మామూలుగా పవన్ కళ్యాణ్‌ సినిమా అంటే ఖచ్చితంగా హాజరవుతాడు త్రివిక్రమ్. అలాంటిది ఈ చిత్రానికి తను స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ కూడా అందించాడు. అందుకే ఈసారి బాధ్యత కూడా భావించాడు.

అఫ్‌ కోర్స్ తను వద్దు అనుకుంటే రావాల్సిన అవసరం లేదు. బట్ పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నాడు. మరి ఆయన వస్తాడో లేదో అందుకే త్రివిక్రమ్ వస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ వేదికపైన మాట్లాడితే చూసేందుకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మాటల వల్లే ఆయన్ని గురూజీ అని కూడా పిలుచుకుంటారు.


ఇక ఈ చిత్రం హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు కాలంతో పరుగులు తీసే మనుషుల గురించి ఉండబోతోంది. కాలం వెనక పరుగులు తీయడమే కాదు.. వృథా చేసేవారిని కూడా హెచ్చరించేలా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం త్రివిక్రమ్ చెప్పే మాటలు కూడా అదిరిపోతాయి. సినిమా కోసం రాస్తున్నప్పుడు కొన్ని బౌండరీస్ ఉంటాయి. బట్ వేదికలపై అవి అవసరం లేదు కాబట్టి.. ఆయన మాటల జలపాతం ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Posts