కాలం ఇంద్రజాలం ”బ్రో”

వెయిట్ ఈజ్ ఓవర్.. బ్రో టీజర్ వచ్చేసింది. ఊహించినదానికంటే ఎక్కువే ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోందీ టీజర్ చూస్తోంటే.

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఫస్ట్ మూవీ కాబట్టి ఇప్పటికే బ్రో పై మంచి అంచనాలున్నాయి.

అందుకే టీజర్ అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర్నుంచీ ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూశారు. ఫైనల్ గా టీజర్ వచ్చేసింది. టీజర్ ఆరంభం అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో పవర్ కోసం వెదుకుతుంటాడు సాయిధరమ్ తేజ్. ఎవరైనా ఉన్నారా అని బిగ్గరగా అరుస్తుంటాడు. ఇక్కడ పవర్ లేదా అనగానే ఓ థండర్ స్ట్రామ్. మెల్లగా పవన్ కళ్యాణ్‌ ఫేస్ రివీల్ అవుతుంది.

ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో గెటప్. తమ్ముడు, ఖుషీ, బాలు, గబ్బర్ సింగ్, కాటమరాయుడు.. ఇలా ఒక్కో గెటప్ తో ఒక్కో తరహా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ఉన్నాయి. పవన్ ఎంట్రీతో ‘ వెల్కమ్ మార్ట్ వెల్కమ్ .. అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది పవన్ కంప్లీట్ ఎంట్రీ. ” కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం” అని చెప్పే డైలాగ్ పవన్ క్యారెక్టరైజేషన్ ను సూచిస్తోంది.


ఇకఇద్దరూ కలిసిన తర్వాత పవన్ .. అదే పనిగా సాయితేజ్ ను టీజ్ చేస్తూ ఉంటాడు. దానికి సాయి.. ‘ చిన్న పిల్లోడ్ని బ్రో’ అంటాడు. దీనికి కౌంటర్ గా పవన్ డైలాగ్ అదిరింది. అయితే పవన్ చివరి డైలాగ్ గా వచ్చిన ” సినిమాలు ఎక్కువగా సూత్తావేంట్రా నువ్వు ” అనే మాట మాత్రం అదిరిపోయింది.

మొత్తంగా కథ ఇదీ అంటూ ఏదీ రివీల్ కాలేదు కానీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం త్రిబుల్ డోస్ లో ఉంటుందన్న విషయం అర్థమైంది. మామూలుగా సముద్రఖని సినిమ అంటే కాస్త మెలో డ్రామా ఎక్కువగా ఉంటుందనుకున్నారు. బట్ ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ కనిపిస్తున్నాడు. ఆ గెటప్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే కొంతకాలంగా ఫ్యాన్స్ మిస్ అవుతున్నది ఇదే కదా అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది.


టీజర్ లో అవుట్ ఫోకస్ లో ప్రియా ప్రకాష్‌ వారియర్ మాత్రం కనిపించింది. అంతే తప్ప మరో ప్రధాన పాత్ర లేదు. మరి ఈ ఇద్దరి మధ్యే నడిచే కథ కాబట్టే అలా చేసి ఉంటారు. ఇక అందరికీ తెలిసిన విషయం.. పవన్ ఈ మూవీలో దేవుడు పాత్రలో కనిపిస్తాడని. మరి ఆ పాత్రకు త్రివిక్రమ్ స్టైల్ స్క్రీన్ ప్లే, చేంజెస్, డైలాగ్స్ యాడ్ అయ్యాయి కాబట్టి.. జూలై 28న విడుదల కాబోతోన్న ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబోతోందని ఫిక్స్ అయిపోవచ్చు బ్రో ..

Related Posts