పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘సలార్‘ ట్రైలర్ రిలీజ్ డేట్ పైనా.. అది వచ్చే సమయం పైనా అధికారిక ప్రకటన వచ్చేసింది. డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటల 19 నిమిషాల నుంచి ‘సలార్.. పార్ట్ 1 సీజ్ ఫైర్‘ ట్రైలర్ సందడి చేయబోతుంది. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఇక.. ఇప్పటివరకూ ‘సలార్‘ నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి.. టీజర్ వచ్చింది. అయినా.. ప్రభాస్ కి సంబంధించిన ఫుల్ లుక్ మాత్రం రివీల్ కాలేదు.
లేటెస్ట్ గా ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ పూర్తిస్థాయి కటౌట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆద్యంతం స్లిమ్ లుక్ లో గన్ పట్టుకుని డైనోసార్ లా విలన్లపై విరుచుకుపడుతున్నట్టు కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గతంలో ‘రాధేశ్యామ్, ఆదిపురుష్‘ సినిమాల విషయంలో ప్రభాస్ లుక్స్ పై భారీ స్థాయిలో కామెంట్లు వచ్చాయి. అయితే.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్లిమ్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్ లో ‘సలార్‘ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…