టాలీవుడ్

రజనీకాంత్ ‘లాల్ సలామ్‘ టీజర్ వచ్చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ కేమియోలో కనిపించబోతున్న చిత్రం ‘లాల్ సలామ్‘. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లాల్ సలామ్‘ నుంచి టీజర్ రిలీజయ్యింది. క్రికెట్ మ్యాచ్ తో మొదలైన ఈ టీజర్ లో.. కుటుంబ గొడవలు, మత ఘర్షణలు వంటివి ఎక్కువగా కనిపించాయి. మధ్యలో మొయిదీన్ భాయ్ గా రజనీకాంత్ ఎంట్రీ అయితే బాగుంది.

మొత్తంమీద ఈ టీజర్ లో స్టోరీలోని మెయిన్ థీమ్ ను ఏమాత్రం రివీల్ చేయలేదు డైరెక్టర్ ఐశ్వర్య. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పొంగల్ స్పెషల్ గా ‘లాల్ సలామ్‘ విడుదలకు ముస్తాబవుతోంది. ఇక.. అదే సమయంలో ఐశ్వర్య మాజీ భర్త ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్‘ కూడా రిలీజ్ కానుంది. చూడాలి.. పొంగల్ పోరులో మాజీ భార్యాభర్తల మధ్య పోటీ ఏ రేంజులో ఉంటుందో.

Telugu 70mm

Recent Posts

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

5 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

6 hours ago

Only one song for the entire movie ‘Kalki’?

Among the crazy movies coming this year at pan India level is 'Kalki 2898 AD'.…

6 hours ago

‘Devara’ songs update from Ramajogayya Sastry

Not only the first song from 'Devara'.. the second song is also coming as a…

6 hours ago

Another aspect of TV actor Chandu’s life

Television actor Chandu's suicide has created a sensation. Serial actress Pavitra died in a car…

6 hours ago

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

8 hours ago