టిల్లు టైటిల్ సాంగ్‌ దైవ నిర్ణయం – టిల్లు స్క్వేర్ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ

టాలీవుడ్ లో మోస్ట్ ఎవెయిటెడ్‌ కల్ట్ ఎంటర్‌టైనర్‌ డిజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్. . సిద్దు జొన్నలగడ్డ కథ,స్క్రీన్‌ప్లే అందించిన ఈ సినిమా మల్లిక్‌ రామ్‌ డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ పోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. అనుపమ పరమేశ్వరన్‌ ఫిమేల్ లీడ్ చేసిన ఈ మూవీ మార్చి 29 న గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. మార్చి 27 న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్‌.

డిజె టిల్లు అంటే ఠక్కు న గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ సాంగ్ సీక్రెట్‌ చెప్పాడు సిద్దు. ఇద్దరు సింగర్స్ అనుకుంటే.. ఇద్దరిలో రామ్‌ మిరియాల కాల్ లిఫ్ట్ చేసాడనీ.. ముందు పాట రికార్డ్ చేసి తర్వాత డబ్బుల మేటర్‌ మాట్లాడుకుందామన్నాడనీ.. ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్లు తక్కువ ఉంటారని చెప్పాడు. ఆ పాట రాసిన కాసర్ల శ్యామ్‌ కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఈ సినిమాలో యాక్టర్స్ అందరి గురించి చెప్తూ.. సినిమాలోని డైలాగ్స్ తో అలరించాడు సిద్దు.

“గత రెండేళ్లుగా ‘డీజే టిల్లు’ పాటలను, మాటలను మీ జీవితంలో ఒక భాగం చేశారు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మార్చి 29న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెప్పారు మల్లిక్‌రామ్‌.
ఈ ఈవెంట్ కి డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్‌లు , నీరజ కోన లు హాజరయి శుభాకాంక్షలు తెలియజేసారు. చిత్ర యూనిట్‌ ని మెచ్చుకుంటూ సినిమా విజయాన్ని కాంక్షించారు.

Related Posts