ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా ‘టిల్లు స్క్వేర్‘ సెలబ్రేషన్స్?

లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ ‘టిల్లు స్క్వేర్‘. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన సినిమా ఇది. సూపర్ హిట్ ‘డీజే టిల్లు‘కి సీక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్‘ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.85 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు దిశగా దూసుకెళ్తోంది.

‘టిల్లు స్క్వేర్‘ చిత్రబృందాన్ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. లేటెస్ట్ గా ఈ సినిమాని చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మూవీ టీమ్ ను ఎంతగానో ప్రశంసించారట. అంతేకాదు.. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగమయ్యేందుకు అంగీకారం తెలిపినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఏప్రిల్ 8న గ్రాండ్ లెవెల్ లో ‘టిల్లు స్క్వేర్‘ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ. సితార సంస్థతో మంచి అనుబంధం ఉన్న యంగ్ టైగర్.. ‘టిల్లు స్క్వేర్‘ సక్సెస్ సెలబ్రేషన్స్ కి చీప్ గెస్ట్ గా రావడానికి అంగీకారాన్ని తెలిపాడట.

Related Posts