గౌరవంగా మరణించాలి అనే కాన్సెప్ట్ తో ‘మెర్సి కిల్లింగ్‘

సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మెర్సి కిల్లింగ్‘. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ చిత్రాన్ని సిద్ధార్ద్ హరియల, మాధవి తాలబత్తుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ప్రతి భారతీయుడు గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి…

ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్‘ అనే కొత్త పాయింట్ తో ఈ సినిమా రూపొందింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నామని చిత్రబృందం చెబుతోంది. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts