ఈ మ్యూజిక్ డైరెక్టర్ చాలా కాస్ట్ లీ

ఒక సినిమా విజయంలో సంగీతానికి సగ భాగం అంటారు. ఆ సినిమా పోతే హీరోలు రెస్పాండ్ అయినట్టుగా సంగీత దర్శకులు రెస్పాండ్ కారు.ఎందుకంటే దర్శకులు అడిగిందే మేం ఇచ్చాం అంటారు. అలా వాళ్లు బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చినా సేఫ్ అయిపోతారు. ప్రస్తుతం సౌత్ లో సంగీత దర్శకుల కొదవ బాగా ఉంది.

ముఖ్యంగా తెలుగులో. ఎందుకంటే మనోళ్లు మనవాళ్ల కంటే బయటి వాళ్లనే ఎక్కువగా నమ్ముతారు. మరి బయటి వాళ్లంటే బాగా డిమాండింగ్ చేస్తారు కదా..? అదే చేస్తున్నాడు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.

అఫ్ కోర్స్ ఇతగాడు అక్కడా అదే డిమాండ్ చేస్తున్నాడు. ఆస్కార్ వరకూ వెళ్లి రెండు తరాలను తన సంగీత ప్రపంచంలో ఓలలాడించిన ఏఆర్ రెహ్మాన్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ అనిరుధ్ కే ఉంది. అందుకే అతను కూడా రెహ్మాన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు.


తెలుగులో అజ్ఞాతవాసి, నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రాలకు సంగీతం అందించాడు అనిరుధ్. ఈ రెండూ పోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రానికి సంగీతం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రానికీ ఇతనే సంగీత దర్శకుడు.ప్రస్తుతం అనిరుధ్ కోసం తెలుగులో భారీ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు అతను ఏకంగా ఒక్కో సినిమాకు పది కోట్లు అడుగుతున్నాడు.

అంటే ఓ మీడియం రేంజ్ హీరో రెమ్యూనరేషన్ అంత. అంతెందుకు.. అఖండకు ముందు వరకూ బాలయ్య.. ఇప్పటికీ నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది అనిరుధ్ కూడా తనకు 10కోట్లు ఇస్తేనే కీ బోర్డ్ పై వేలు పెడతా అంటున్నాడు. మరీ ఇంత రెమ్యూనరేషన్ మన దేవీశ్రీ ప్రసాద్, తమన్ లకు కూడా లేదు. అందుకే అతను అంత డిమాండ్ చేస్తున్నాడు.


ఇక ప్రస్తుతం అనిరుధ్ అకౌంట్ లో తెలుగు నుంచి దేవర, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు జైలర్, జవాన్, లియో, భారతీయుడు2 వంటి భారీ చిత్రాలున్నాయి. అన్నట్టు.. రీసెంట్ గా జైలర్ నుంచి విడుదలైన రెండో సాంగ్ తో మనోడు కూడా క్యాప్ క్యాట్ గా దొరికిపోయాడు. అయినా అంత డిమాండ్ చేస్తున్నాడంటే మనవాళ్లు తెలుగు సంగీత దర్శకులను ఎంతలా పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదూ.. ?

Related Posts