సెప్టెంబర్ లో షేక్ కాబోతోన్న ఇండియన్ బాక్సాఫీస్

ఒకప్పుడు పెద్ద సినిమాలు రావాలంటే మంచి టైమ్, హాలీడేస్ ఇలాంటివి చూసుకునేవారు. అందుకోసం పండగల సీజన్ ను వాళ్లే ఆక్రమించేవాళ్లు. దీంతో పండగల టైమ్ కు చిన్న సినిమాకు స్పేసే ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. సినిమాపై బజ్ క్రియేట్ చేసి.. ప్రమోషన్స్ తో ఆడియన్స్ నుంచి అటెన్షన్ సంపాదించగలిగితే.. సీజన్ తో పనిలేదు.సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు కూడా అంతే. ఫలానా టైమ్ లోనే చూడాలి అనుకోవడం లేదు. మౌత్ టాక్ స్ప్రెడ్ అయినా చాలు.. పొలోమంటూ వెళ్లిపోతున్నారు.

అందుకే ఫెస్టివ్ సీజన్స్ ను చూసి కాకుండా తాము వచ్చినప్పుడే ఫెస్టివల్ లా ఉండాలని పెద్ద హీరోల సినిమాలు విడుదల చేస్తున్నారు. అలా ఈ సెప్టెంబర్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఒకటి నుంచి 28 వరకూ వరుసగా పెద్ద సినిమాలే విడుదల కాబోతున్నాయి.

అందులో ముందుగా వస్తోన్న సినిమా విజయ్ దేవరకొండ,సమంతల ఖుషీ.సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ, సమంతల ఖుషీ వస్తోంది.నిన్నుకోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ విడుదలైన పాటలు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.


సెప్టెంబర్ 7న ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి షారుఖ్ ఖాన్ జవాన్ లా రాబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో జవాన్ పై తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటి టాలెంటెడ్ సౌత్ ఆర్టిస్టులున్నారు.

ఆపై 15న రామ్, బోయపాటిల స్కంద సినిమా విడుదల కాబోతోంది.స్కందను కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. 15నే లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటిస్తోన్న చంద్రముఖి2 విడుల కాబోతోంది. కే వాసు డైరెక్ట్ చేసిన చంద్రముఖి 2 ను కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తారు. ఇదే రోజు డిజే టిల్లు స్క్వేర్ సినిమా ఉంది. కానీ రిలీజ్ డేట్ మారొచ్చంటున్నారు.

28న ప్రపంచ వ్యాప్తంగా అంచనాలున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ విడుదల కాబోతోంది. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. మరి ఈ సెప్టెంబర్ జోష్ ఇండియన్ సినిమా మార్కెట్ ను ఏ లెవెల్ కు తీసుకువెళుతుందో చూడాలి.

Related Posts