Ram pothineni: రీ రిలీజ్ కు “రెడీ” చేస్తున్నారు.. మరి బజ్ ఏదీ..?

ఈ మధ్య ఓల్డ్ హిట్ మూవీస్ ను మళ్లీ విడుదల చేయడం అందరికీ మామూలయింది. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ఖుషీ, రామ్ చరణ్‌ ఆరెంజ్, మహేష్‌ బాబు ఒక్కడు, అల్లు అర్జున్ దేశముదురు వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలను రీ రిలీజ్ చేశారు. అందులో కొన్ని తప్ప మిగతావేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఈ ట్రెండ్ లోకి రామ్ పోతినేని కూడా ఎంటర్ అవుతున్నాడు.


2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ”రెడీ” చిత్రాన్ని ఈ ఆదివారం మళ్లీ విడుదల చేయబోతున్నారు. అప్పట్లో ఈ తరహా చిత్రాల ట్రెండ్ ను మొదలుపెట్టింది రెడీ సినిమా. రెడీ తర్వాత దాదాపు అదే కంటెంట్ తో శ్రీను వైట్ల డైరెక్షన్ లోనే కోన వెంకట్ మాటలతో అనేక చిత్రాలు వచ్చాయి.

మిగతా దర్శకులు కూడా బ్రహ్మానందంను బకరాను చేస్తూ సరికొత్త కామెడీ ట్రాకులు రాసుకున్నారు. అందుకు పునాది ఈ చిత్రమే. రామ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బ్రహ్మానందం దాదాపు మరో హీరో అన్నంత రేంజ్ లో మూవీకి తన కామెడీతో కంట్రిబ్యూట్ చేశాడు.

అలాంటి రెడీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో సందడి మాత్రం కనిపించడం లేదు. మామూలుగా ఇప్పుడు కొత్తగా వస్తోన్న చిత్రాలకే ఆడియన్స్ పెద్దగా రావడం లేదు. అలాంటిది అవుట్ డేటెడ్ ట్రెండ్ అనిపించుకున్న రెడీ లాంటి సినిమాలకు జన వస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఏదేమైనా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ ముదిరిపోతోందనే చెప్పా

Related Posts