టాలీవుడ్ లోనే కాదు ఏ వూడ్ లో అయినా ఇప్పుడు వారసులదే హవా. టాలెంట్ తో పనిలేకుండానే కొందరు ఎంట్రీ ఇస్తారు. తర్వాత ప్రతిభను మెరుగుపరుచుకుంటూ నిలిచేది కొందరైతే.. అస్సలే మాత్రం ప్రేక్షకుల ఆదరణ లేక కనుమరుగయ్యేవారు కొందరు. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా వస్తున్నారు. అలా ప్రస్తుతం తెలుగులో దగ్గుబాటి(Daggubati) ఫ్యామిలీ నుంచి మూడో రెండో తరంలో రెండో హీరోగా అభిరామ్(Abhiram) అరంగేట్రం చేస్తున్నాడు.
వెంకటేష్(Venkatesh) కు నట వారసుడుగా సురేష్ బాబు(D. Suresh Babu తనయుడు రానా(Rana) ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రానాతో పాటు అతని తమ్ముడు అభిరామ్ వస్తున్నాడు. తేజ(Teja) దర్శకత్వంలో లాంచ్ అవుతున్న అభిరామ్ సినిమా పేరు అహింస(Ahimsa).
ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. కాకపోతే నటుడుగా అభిరామ్ ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేదే పెద్ద ప్రశ్న. ఈ చిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. నిజానికి గతంలోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. బట్ పోటీ వల్ల ధైర్యం చేయలేకపోయారు. ఫైనల్ గా జూన్ 2 అంటున్నారు. అయితే అదే రోజు బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) వారసుడు గణేష్(Bellamkonda Ganesh) సినిమా కూడా ఉండటం విశేషం.
నిర్మాతగా భారీ చిత్రాలు చేసిన బెల్లంకొండ సురేష్ తన పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్(Sai Srinivas) ను హీరోగా పరిచయం చేశాడు. ఇంకా స్టార్డమ్ తెచ్చుకోలేదు కానీ.. శ్రీనివాస్ ఇప్పటికైతే తన ముద్రను వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. లేటెస్ట్ గా బాలీవుడ్ డెబ్యూ కూడా ఇచ్చాడు.
ఇక అతని తమ్ముడు.. సురేష్ రెండో కొడుకు గణేష్ ను కూడా హీరోగా లాంచ్ చేశారు. మొదట్లో గణేష్ పై చాలా సందేహాలున్నాయి. బట్ ఫస్ట్ మూవీ స్వాతిముత్యంతో బానే ఆకట్టుకున్నాడు గణేష్. ఇప్పుడు రెండో సినిమా ‘నేను స్టూడెంట్ ను సర్‘ (Nenu Student nu Sir)అనే చిత్రంతో వస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కూడా జూన్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి ఈ రెండు ఫ్యామిలీస్ నుంచి వస్తోన్న ఇద్దరు చోటా హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో కానీ.. బాక్సాఫీస్ వద్ద మినీ వార్ జరుగుతుందని చెప్పొచ్చు. మరి నిర్మాతల వారసులుగా నటులై హీరోలుగా వస్తోన్న ఈ ఇద్దరి మధ్య పోటీలో విన్నర్ ఎవరో చూడాలి.