రీ-రిలీజుల్లో విజయ్ సినిమా సరికొత్త రికార్డ్

ఒక రీమేక్ సినిమా.. అది కూడా రీ-రిలీజులో రూ.20 కోట్లు గ్రాస్ కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. తమిళ దళపతి విజయ్ నటించిన ‘గిల్లీ‘ ఇప్పుడు అలాంటి రికార్డునే సాధించింది. తమిళంలో 2004లో విడుదలైన ‘గిల్లీ‘ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీలో విజయ్ కి జోడీగా త్రిష నటించింది. అసలు.. ఈ చిత్రం తెలుగు సినిమా ‘ఒక్కడు‘కి రీమేక్. తమిళంలో ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో ధరణి తెరకెక్కించిన ‘గిల్లీ‘.. ఈ ఏప్రిల్ 20న మళ్లీ గ్రాండ్ లెవెల్ లో రీ-రిలీజ్ అయ్యింది.

రీ-రిలీజ్ లో ఇప్పటివరకూ ‘గిల్లీ‘ చిత్రంకి రూ.20 కోట్లు వసూళ్లు దక్కాయి. ఇంకా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ రన్ కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో ‘గిల్లీ‘ సినిమా మరిన్ని కోట్లు కొల్లగొట్టే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు కోలీవుడ్ ట్రేడ్ పండిట్స్. విజయ్ మాస్ ఇమేజ్, త్రిష్ అందంతో పాటు.. విద్యా సాగర్ కంపోజ్ చేసిన పాటలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ మూవీలోని ‘అప్పడి పోడు‘ సాంగ్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

Related Posts