పాప తప్పు లేదు.. ఫ్లాపు తప్పలేదు

హిట్.. ఈ మాట వినపోతే ఎంతటి వారైనా అంతే సంగతలు అని ఇప్పటికే ఎంతోమంది చూసి ఉన్నాం. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం లేకపోతే ఆ ప్రతిభ ఎవరికీ తెలియకుండానే పోతుంది. ఇక హీరోయిన్లకైతే ఫస్ట్ క్వాలిఫికేషన్ అందం. అవసరాన్ని బట్టి అది ప్రదర్శించేందుకు అభ్యంతరం లేకపోవడం చూస్తారు. ఈ రెండు విషయాల్లో ఆల్రెడీ సోషల్ మీడియాను హీటెక్కించి వెండితెర ఛాన్స్ కొట్టిన బ్యూటీ కేతికశర్మ.

ఫస్ట్ మూవీ రొమాంటిక్ లో అమ్మడి అందాలు చూసి కుర్రాళ్లకు జ్వరం వచ్చేసింది. ఈ సినిమాలో ఏం లేకపోయినా కమర్షియల్ గా గట్టెక్కిందంటే అది కేతిక టాలెంట్ వల్లే అంటే అతిశయోక్తి కాదు. అందుకే వెంటనే వరుసగా రెండు ప్రామిసింగ్ ఆఫర్స్ వచ్చాయి. నాగశౌర్య సరసన లక్ష్యతో పాటు వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా సినిమాలతో తన కెరీర్ టాలీవుడ్ లో వెలిగిపోతుంది అనుకుంది. కానీ ఈ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి.

ఒక్క ఫ్లాప్ వస్తేనే పట్టించుకోరు మనవాళ్లు. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అంటే ఐరన్ లెగ్ అనేస్తారు కదా. అలాగే కేతిను పక్కన పెట్టారు. అయినా అమ్మడు పట్టు వదలకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ పెట్టేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది. ఆఖరికి అది ఫలించి మళ్లీ మెగా క్యాంప్ లోనే ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ సినిమా బ్రో లో అవకాశం అందుకుంది. సాయితేజ్ కు జోడీగా నటించిందీ సినిమాలో. కానీ ఆమె పాత్రకు ఏ ప్రాధాన్యతా లేదు. ఒక డ్యూయొట్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే సినిమాలో హీరోయిన్ ఎవరూ అంటే ఆ ప్రశ్నకు సమాధానంగా తను కనిపిస్తోందంతే.


బ్రో కు సైతం మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ రోజు రోజుకూ డ్రాప్ అవుతున్నాయి. చాలామంది యావరేజ్ అనేశారు. మొదటి రోజు ఫ్యాన్స్ హంగామా వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ నెక్ట్స్ డే కు అవి నిలబడలేదు. ఇక సోమవారానికి మాగ్జిమం కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి అంటోంది ట్రేడ్. వాళ్లు ఒప్పుకోరేమో కానీ.. ఈ సినిమా దాదాపు ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. దాన్ని కాపాడేందుకు మూవీ టీమ్ అంతా పబ్లిక్ టూర్ కు ప్లాన్ చేసుకుని బరిలోకి దిగింది.

ఇది ఎంత వరకూ ఉపయోపడుతుందో చెప్పలేం కానీ.. ఇప్పుడు కేతిక శర్మ తన ప్రమేయం పెద్దగా లేకుండానే ఈ ఫ్లాప్ లో భాగమైంది. తను మెయిన్ హీరోయిన్ కాదు. పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రా కాదు. అయినా ఆమెకూ ఈ ఫ్లాప్ అంటగడుతున్నారు. పాపకు అదృష్టం లేదంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. ఇంకొందరైతే మరోసారి ఐరన్ లెగ్ వల్లే సినిమా పోయిందని దారుణంగా విమర్శిస్తున్నారు.

బ్రో తన అకౌంట్ లో మరో నంబర్ గా మారింది తప్ప ఏ ఉపయోగం లేదు. కొందరు మాత్రమే పాప తప్పు లేకపోయినా ఫ్లాపు తప్పలేదంటున్నారు. మరి ఇవన్నీ చూస్తే కేతికకు మరో సినిమా వస్తుందనే ఆశలు కూడా దూరం అవుతున్నట్టే కనిపిస్తోంది.

Related Posts