టాలీవుడ్

Vimaanam trailer : ట్రైలర్ తోనే మనసులు దోచేశారుగా

కొన్ని సినిమాలు స్టార్ కాస్ట్ తో పనిలేకుండానే ఆకట్టుకుంటాయి. చూడ్డానికి ఆర్ట్ మూవీస్ లా ఉన్నా.. కాస్త కమర్షియల్ వాల్యూస్ కూడా యాడ్ అయితే విమర్శకులను మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తాయి. ఈ నెల 9న రాబోతోన్న విమానం మూవీ ట్రైలర్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ఇందులో స్టార్ కాస్ట్ లేదు. సముద్రఖని వికలాంగుడు పాత్రలో నటిస్తున్నాడు.

అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కుర్రాడికి విమానం ఎక్కాలని ఆశ. ఆ ఆశను తీర్చేందుకు నిరుపేద అయిన ఆ తండ్రి పడే తపన.. ఇదే సినిమా థీమ్. ఈ థీమ్ చుట్టూ రకరకాల మనుషులు.. వారి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు.. సమాజంలో వారికి ఉండే గౌరవం.. సమాజం పట్ల వారికి ఉండే అభిప్రాయాలు.. ఇదే బస్తీలో ఒళ్లు అమ్ముకునే ఓ మహిళ.. ఇలా కమర్షియల్ వాల్యూస్ ను కూడా యాడ్ చేసుకుని రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ మధ్య విడుదలైన టీజర్ తోనే ఇంప్రెస్ చేసిన టీమ్.. ఈ ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంటోంది.


ప్రధాన పాత్రలో సముద్రఖని నటిస్తుండగా.. అతని కొడుకుగా మాస్టర్ ధృవన్ నటించాడు. ఇతర పాత్రల్లో వేశ్యగా అనసూయ ఆమెను ప్రేమించే వ్యక్తిగా రాహుల్ రామకృష్ణ.. ఆ బస్తీ మనుషులుగా ధన్ రాజ్, మీరా జాస్మిన్ కనిపిస్తున్నారు.

విశేషం ఏంటంటే దాదాపు పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తోంది. మొత్తంగా తన కొడుకును విమానం ఎక్కించి ఆ తర్వాత అతన్ని పైలట్ చేయాలనుకునే వికలాంగుడైన ఓ తండ్రి ఆశ, ఆశయం నేపథ్యంలో కావాల్సినంత ఎమోషన్ తో రూపొందినట్టుగా కనిపిస్తోన్న విమానం మూవీ కమర్షియల్ గా ఎలా ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మనసులను దోచుకునేలా ఉంది.


శివ ప్రసాద్ యానాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కిరణ్‌ కొర్రపాటి, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. చరణ్‌ అర్జున్ సంగీతం అందించాడు. ఆ మధ్య విడుదల చేసిన అనసూయ పాట చాలా బావుందన్న టాక్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ లో కూడా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ నెల 9న విడుదల కాబోతోన్న విమానం మూవీ ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

14 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

14 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

14 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

14 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

20 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

20 hours ago