Vimaanam trailer : ట్రైలర్ తోనే మనసులు దోచేశారుగా

కొన్ని సినిమాలు స్టార్ కాస్ట్ తో పనిలేకుండానే ఆకట్టుకుంటాయి. చూడ్డానికి ఆర్ట్ మూవీస్ లా ఉన్నా.. కాస్త కమర్షియల్ వాల్యూస్ కూడా యాడ్ అయితే విమర్శకులను మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తాయి. ఈ నెల 9న రాబోతోన్న విమానం మూవీ ట్రైలర్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ఇందులో స్టార్ కాస్ట్ లేదు. సముద్రఖని వికలాంగుడు పాత్రలో నటిస్తున్నాడు.

అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కుర్రాడికి విమానం ఎక్కాలని ఆశ. ఆ ఆశను తీర్చేందుకు నిరుపేద అయిన ఆ తండ్రి పడే తపన.. ఇదే సినిమా థీమ్. ఈ థీమ్ చుట్టూ రకరకాల మనుషులు.. వారి వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు.. సమాజంలో వారికి ఉండే గౌరవం.. సమాజం పట్ల వారికి ఉండే అభిప్రాయాలు.. ఇదే బస్తీలో ఒళ్లు అమ్ముకునే ఓ మహిళ.. ఇలా కమర్షియల్ వాల్యూస్ ను కూడా యాడ్ చేసుకుని రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా కనిపిస్తోంది. ఆ మధ్య విడుదలైన టీజర్ తోనే ఇంప్రెస్ చేసిన టీమ్.. ఈ ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకుంటోంది.


ప్రధాన పాత్రలో సముద్రఖని నటిస్తుండగా.. అతని కొడుకుగా మాస్టర్ ధృవన్ నటించాడు. ఇతర పాత్రల్లో వేశ్యగా అనసూయ ఆమెను ప్రేమించే వ్యక్తిగా రాహుల్ రామకృష్ణ.. ఆ బస్తీ మనుషులుగా ధన్ రాజ్, మీరా జాస్మిన్ కనిపిస్తున్నారు.

విశేషం ఏంటంటే దాదాపు పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇస్తోంది. మొత్తంగా తన కొడుకును విమానం ఎక్కించి ఆ తర్వాత అతన్ని పైలట్ చేయాలనుకునే వికలాంగుడైన ఓ తండ్రి ఆశ, ఆశయం నేపథ్యంలో కావాల్సినంత ఎమోషన్ తో రూపొందినట్టుగా కనిపిస్తోన్న విమానం మూవీ కమర్షియల్ గా ఎలా ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మనసులను దోచుకునేలా ఉంది.


శివ