‘స్పిరిట్’ కోసం కథానాయిక రేసులో ఆ ముగ్గురూ!

‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘యానిమల్’ వరకూ తన సినిమాల ప్రొడక్షన్ విషయంలో చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే.. ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే ‘స్పిరిట్’ను మాత్రం జెట్ స్పీడులో కంప్లీట్ చేయడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నాడు.

లేటెస్ట్ గా ‘స్పిరిట్’ మూవీలో హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా.. తన మూవీస్ లో హీరోయిన్స్ ను చాలా రొమాంటిక్ గా చూపిస్తుంటాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం ముగ్గురు భామలను షార్ట్ లిస్ట్ చేశాడట. వాళ్లే.. రష్మిక, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్. వీరు ముగ్గురూ ఇప్పటివరకూ రెబెల్ స్టార్ తో కలిసి నటించలేదు. అయితే.. వీళ్లలో మృణాల్ ఠాకూర్ మాత్రం హను రాఘవపూడితో ప్రభాస్ చేసే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందనే ప్రచారం ఉంది. ఒకవేళ మృణాల్.. ప్రభాస్-హను మూవీకి కమిట్ అయితే మాత్రం కీర్తి సురేష్ కానీ, రష్మికని కానీ.. ‘స్పిరిట్’లో నాయికగా ఫైనలైజ్ చేయనున్నాడట సందీప్ రెడ్డి వంగా.

Related Posts