‘ప్రేమికుడు’ పాటకు స్టెప్పులేసిన రాజమౌళి

దర్శకత్వంలో ధీరుడైన రాజమౌళి.. మంచి అందగాడు. హీరోగా చేయకపోయినా నటనలోనూ దిట్టే. తన సినిమాల్లోని నటీనటులకు ప్రతీ సీన్ ను దగ్గరుండి నటించి చూపిస్తుంటాడు. ఇక.. లేటెస్ట్ గా జక్కన్న తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ ను కూడా బయటపెట్టాడు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్పులేశాడు రాజమౌళి. ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘అందరమైన ప్రేమరాణి’ పాటకు రాజమౌళి, రమా వేసిన స్టెప్పులకు అక్కడ ఆహుతులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related Posts