‘సలార్‘ నుంచి రెండో పాట ‘ప్రతి గాథలో..‘

‘సలార్‘ సినిమా మిగతా చిత్రాల తరహాలో ఉండదని.. ఈ మూవీ సమ్ థింగ్ స్పెషల్ అని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు ప్రశాంత్ నీల్. అందుకే.. ఈ సినిమాలో రెగ్యులర్ మాస్ మసాలా సాంగ్స్ ఏమీ ఉండవట. కంటెంట్ డిమాండ్ మేరకే ఈ చిత్రంలో పాటలు పెట్టామని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘సూరీడే..‘ గీతానికి మంచి స్పందన వచ్చింది. ప్రభాస్, పృథ్వీరాజ్ స్నేహం నేపథ్యంలో ఆ పాటను తీర్చిదిద్దాడు ప్రశాంత్.

లేటెస్ట్ గా ‘సలార్‘ నుంచి సెకండ్ సింగిల్ రిలీజయ్యింది. ఒక బడిలో పిల్లలను ఉద్దేశిస్తూ ఈశ్వరిరావు.. ‘విజయ్.. నేను నేర్పించిన పాట గుర్తింది కదా.. పాడు అంటోంది..‘ అప్పుడు ఆ పిల్లలు పాడే గీతంగా ‘ప్రతి గాథలో రాక్షసుడే.. హింసలు పెడతాడు.. అణచగానే పుడతాడు..
రాజే ఒకడు..‘ అంటూ ఈ గీతం సాగుతోంది. రాక్షసుల్ని మట్టుపెట్టడానికి రాజు రాబోతున్నాడు అనే సందేశంతో సాగే ఈ గీతంలో ప్రభాస్ ఎలివేషన్స్ హైలైట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. శృతి హాసన్, సప్తగిరి కూడా ఈ పాటలో కనిపిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతంలో కొంతమంది పిల్లలు ఆలపించిన ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశాడు.

Related Posts