‘ప్రేమలు’కి రెండో భాగం రెడీ అవుతోంది!

ఈమధ్య కాలంలో ఒక సినిమా హిట్టైందంటే.. అదే ఫ్రాంఛైజ్ లో వరుస సినిమాలను తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే.. పీరియడ్, క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్స్ వంటి జోనర్స్ మూవీస్ కే ఎక్కువగా సీక్వెల్స్ వస్తుంటాయి. కానీ.. లేటెస్ట్ గా సూపర్ హిట్ మూవీ ‘ప్రేమలు’కి సీక్వెల్ ని ప్రకటించారు మేకర్స్.

ఆద్యంతం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన మలయాళం చిత్రం ‘ప్రేమలు’. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ బాక్సాఫీస్ వద్ద విడుదలైన ‘ప్రేమలు’ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. మలయాళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. చిన్న చిత్రాల్లోనే అరుదైన రికార్డును కొల్లగొట్టింది. అంతేకాదు.. తెలుగులోనూ అదే పేరుతో విడుదలై ఇక్కడా మంచి విజయాన్ని సాధించింది.

ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన నస్లేన్, మమిత బైజు నటనకు మంచి పేరొచ్చింది. త్వరలో పట్టాలెక్కే ‘ప్రేమలు 2’ 2025 వేసవి కానుకగా విడుదలకు సిద్ధమవుతోందట. ఈ సీక్వెల్ ని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ‘ప్రేమలు 2’ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు.

Related Posts