‘కాంతార’ ప్రీక్వెల్ లో మలయాళీ సూపర్ స్టార్?

కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం ‘కాంతార’. తొలుత కన్నడలో విడుదలైన ‘కాంతార’ ఆ తర్వాత అనువాద రూపంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సంచలనాలు సృష్టించింది. ‘కాంతార‘ మూవీ కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతీ విషయమూ ఓ సంచలనం అయ్యింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఎంతో మంచి పేరొచ్చింది. ముఖ్యంగా.. చివరి 20 నిమిషాలలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు రిషబ్. అయితే.. ఆడియన్స్ ఇప్పటికే చూసింది ‘కాంతార 2’ మాత్రమే. ఇప్పుడు ‘కాంతార’కి ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది.

హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ మూవీకి ఈసారి పాన్ ఇండియా టచ్ ఇస్తున్నాడు రిషబ్ శెట్టి. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ లో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని భాగస్వామ్యం చేస్తున్నాడట. లేటెస్ట్ గా రిషబ్ శెట్టి.. మోహన్ లాల్ ని కలిసిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే.. తెలుగు, తమిళం భాషల నుంచి కూడా ఈ మూవీలోకి కొంతమంది అగ్రతారలను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ‘కాంతర’ ప్రీక్వెల్ కి కూడా అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.

Related Posts