టాలీవుడ్

హీరోయిన్ ను కమిట్మెంట్ అడిగిన బేబీ నిర్మాత

కమిట్మెంట్.. ఈ మాట వింటే ఇండస్ట్రీ ఉలిక్కి పడుతుంది. ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది ఎవరూ చెప్పలేరు కానీ.. చాలామంది హీరోయిన్లు, మహిళా ఆర్టిస్టులు.. తమను ఫలానా దర్శకుడు, నిర్మాత, కో డైరెక్టర్ లేదా మరొకరు తమను పాత్ర కోసం కమిట్ మెంట్ అడిగారు అని చెబుతుంటారు. దాన్ని కవర్ చేసుకోలేక సదరు ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు నానా తంటాలు పడుతుంటారు.

ఒక్కోసారి వాళ్లు చేసే ఆరోపణలు నిజం కాదు కూడా. కాకపోతే కొన్నాళ్లుగా దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో ఒకరకమైన ఉద్యమం నడుస్తోంది. తెలుగులో కూడా ఆ మీ టూ ఉద్యమం కొన్ని రోజులు గట్టిగానే సాగింది. అందుకు కమిట్మెంట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. టాలీవుడ్ లో కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఓ కమిటీ కూడా వేశారు.


ఇక ప్రస్తుతం తెలుగులో బేబీ అనే సినిమా హవా బాగా నడుస్తోంది. భారీ ప్రమోషన్స్ కు తోడు బలమైన కంటెంట్ కూడా ఉందనే ప్రచారంతో తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాపై మంచి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కమిట్మెంట్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఒప్పుకున్నప్పుడు నిర్మాత ఎస్కేఎన్ తనను కమిట్మెంట్ అడిగాడట.

అంటే అందరూ అనుకునేది కాదు. ‘బేబీ సినిమా చేస్తున్నంత కాలం తను మళ్లీ ఏ యూ ట్యూబ్ లోనూ కనిపించకూడదు’.. ఇదే ఆ కమిట్మెంట్. నిజానికి దీన్ని కమిట్మెంట్ అనే కంటే కండీషన్ అంటే బావుంటుందేమో. కానీ వాళ్లే ఓ ఇంటర్వ్యూలో ఆ పదం వాడారు కాబట్టి.. ఇబ్బందేం లేదేమో. మరి సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే నిర్మాత అలా కండీషన్ పెడతాడు. ఇలాంటి కథల్లో నటించే ఆర్టిస్టులు మళ్లీ తక్కువ ప్లాట్ ఫామ్ లో కనిపిస్తే.. ఈ స్టోరీలో ఉండే థిక్ నెస్ తగ్గుతుంది. అందుకే మేకర్స్ ఆమెకు ఆ కండీషన్ పెట్టారు.


నిజానికి హీరోయిన్ వైష్ణవి చైతన్య ఫేమ్ అయిందే యూ ట్యూబ్ ద్వారా. ఆ ప్లాట్ ఫామ్ లో చేసిన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల వల్లే తనకు ఓ పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీయే ఇప్పుడు హీరోయిన్ వరకూ తీసుకువచ్చింది. మరి మళ్లీ యూ ట్యూబ్ వైపు వెళితే తను వెనక్కి వెళ్లినట్టే కదా.. అందుకే ఎస్కేఎన్ తనను ఈ కమిట్మెంట్ అడిగి ఆ తర్వాతే తీసుకున్నాడు అనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

12 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

12 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

13 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

13 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

18 hours ago