హీరోయిన్ ను కమిట్మెంట్ అడిగిన బేబీ నిర్మాత

కమిట్మెంట్.. ఈ మాట వింటే ఇండస్ట్రీ ఉలిక్కి పడుతుంది. ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది ఎవరూ చెప్పలేరు కానీ.. చాలామంది హీరోయిన్లు, మహిళా ఆర్టిస్టులు.. తమను ఫలానా దర్శకుడు, నిర్మాత, కో డైరెక్టర్ లేదా మరొకరు తమను పాత్ర కోసం కమిట్ మెంట్ అడిగారు అని చెబుతుంటారు. దాన్ని కవర్ చేసుకోలేక సదరు ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు నానా తంటాలు పడుతుంటారు.

ఒక్కోసారి వాళ్లు చేసే ఆరోపణలు నిజం కాదు కూడా. కాకపోతే కొన్నాళ్లుగా దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో ఒకరకమైన ఉద్యమం నడుస్తోంది. తెలుగులో కూడా ఆ మీ టూ ఉద్యమం కొన్ని రోజులు గట్టిగానే సాగింది. అందుకు కమిట్మెంట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. టాలీవుడ్ లో కూడా ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఓ కమిటీ కూడా వేశారు.


ఇక ప్రస్తుతం తెలుగులో బేబీ అనే సినిమా హవా బాగా నడుస్తోంది. భారీ ప్రమోషన్స్ కు తోడు బలమైన కంటెంట్ కూడా ఉందనే ప్రచారంతో తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాపై మంచి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కమిట్మెంట్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు ఒప్పుకున్నప్పుడు నిర్మాత ఎస్కేఎన్ తనను కమిట్మెంట్ అడిగాడట.

అంటే అందరూ అనుకునేది కాదు. ‘బేబీ సినిమా చేస్తున్నంత కాలం తను మళ్లీ ఏ యూ ట్యూబ్ లోనూ కనిపించకూడదు’.. ఇదే ఆ కమిట్మెంట్. నిజానికి దీన్ని కమిట్మెంట్ అనే కంటే కండీషన్ అంటే బావుంటుందేమో. కానీ వాళ్లే ఓ ఇంటర్వ్యూలో ఆ పదం వాడారు కాబట్టి.. ఇబ్బందేం లేదేమో. మరి సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే నిర్మాత అలా �