కొనసాగుతూనే ఉన్న ‘కల్కి‘ రిలీజ్ రగడ..!

అన్ని భాషల్లోనూ సినిమాల ప్రొడక్షన్ భారీగా పెరిగింది. వారం వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలే థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈకోవలోనే.. పెద్ద సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ విషయంలో చాలా పక్కాగా ఉంటున్నారు మేకర్స్. కొన్ని నెలల ముందుగానే విడుదల తేదీలను లాక్ చేసి పెడుతున్నారు. అయినా.. కొన్ని అనివార్య కారణాలతో అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేయలేకపోతున్నారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి‘ విషయంలో అదే జరుగుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ సంస్థకు బాగా కలిసొచ్చిన తేదీ మే 9. అదే తారీఖున ‘కల్కి‘ని విడుదల చేయాలని వైజయంతీ భావించింది. కానీ.. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పీక్స్ లో ఉంటుంది. దీంతో.. ‘కల్కి‘ చిత్రాన్ని ఖచ్చితంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో.. ‘కల్కి‘ చిత్రానికి కొత్త తేదీని ప్రకటించాల్సిన బాధ్యత వైజయంతీ మూవీస్ పై ఉంది.

‘కల్కి‘ సినిమాని జూన్ లేదా జూలైలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉందట వైజయంతీ మూవీస్. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రానికి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ పనులు ఇంకా బాకీ ఉండడమే. మరోవైపు ‘కల్కి‘ సినిమాని మే నెలఖరుకి చేయమని డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాణ సంస్థకు బాగా ప్రెజర్ వస్తోందట. మరి.. ‘కల్కి‘ కొత్త తేదీపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts