‘మనమే‘ టీజర్.. స్టైలిష్ లుక్ లో అదరగొడుతోన్న శర్వానంద్

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మనమే‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శర్వాకి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది. లేటెస్ట్ గా ‘మనమే‘ మూవీ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ‘మంచిగా కనబడే వాళ్లందరూ మంచోళ్లు కాదురా.. ఫర్ ఎగ్జాంఫుల్ నేను.. చాలా మంచోడిలా కనిపిస్తా.. కానీ మంచోడినా కాదు.‘ అంటూ తన క్యారెక్టర్ గురించి శర్వానంద్ చెప్పే విజువల్స్ తో టీజర్ మొదలైంది. అలాగే.. ‘ఒకరికి మాట ఇస్తే.. ఆ మాటకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామా? అన్న దాన్ని బట్టి మన క్యారెక్టర్ డిసైడ్ అవుతోంది?‘ అంటూ హీరోయిన్ కృతి శెట్టి క్యారెక్టర్ ను కూడా టీజర్ లో చెప్పకనే చెప్పేశాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.

పూర్తిగా వ్యతిరేక స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఓ బాబు కోసం కలిసి జీవించాల్సి వస్తే.. ఎలా ఉంటుంది అన్నదే ‘మనమే‘ టీజర్ లో చూపించారు. యూరప్ బ్యాక్ డ్రాప్ తో సాగే రిచ్ విజువల్స్ తో టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. శర్వానంద్ 35వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ వేసవిలో ‘మనమే‘ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Related Posts