మృణాల్ ఆలోచిస్తుంది.. మెహ్రీన్ చేసి చూపించింది

ఒకవైపు కెరీర్ ను నిలబెట్టుకుంటూనే.. మరోవైపు తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు నేటితరం తారామణులు. ఈకోవలోనే.. హీరోయిన్ గా లాంగ్ కెరీర్ కొనసాగిస్తున్న కొంతమంది కథానాయికలు ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇటీవల పిల్లల్ని కనడంపై మృణాల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలుపుతూనే.. ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నాను అని తెలిపింది.

మృణాల్ ఇంకా ఆలోచిస్తుంది. అయితే.. మరో మెస్మరైజింగ్ బ్యూటీ మెహ్రీన్ ఆచరించి చూపించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్ తో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే.. ఏమైందో ఏమో వీరిద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక.. త్వరలో మూడు పదుల వయసును పూర్తిచేసుకోనున్న మెహ్రీన్.. భవిష్యత్తులో పిల్లలను కనేందుకు గర్భాశ్రయంలో ఎగ్ ఫ్రీజింగ్‌ను ఆశ్రయించింది. తన ఎగ్స్ ను స్తంభింపజేస్తున్నట్లు తెలుపుతూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Related Posts