నవంబర్ నుంచి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్?

ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి. అసలు ఈపాటికే పట్టాలెక్కాల్సిన ఈ సినిమా వీరిద్దరూ వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యమయ్యింది. ప్రస్తుతం ‘దేవర 1’ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన తారక్.. ‘వార్ 2’ని కూడా సైమల్టేనియస్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ‘దేవర 1’ అక్టోబర్ లో దసరా కానుకగా విడుదలవుతుంటే.. ఆ సమయానికి ‘వార్ 2’ నుంచి ఫ్రీ అయిపోతాడు తారక్. దీంతో.. నవంబర్ నుంచే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడట.

అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేస్తున్నాడట ప్రశాంత్ నీల్. ఎక్కువగా విదేశాల్లోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ జరుపుకోనుందట. మరోవైపు.. ‘సలార్ 2, కె.జి.యఫ్ 3’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ప్రశాంత్ నీల్ కిట్టీలో ఉన్నాయి.

Related Posts