గోపీచంద్-శ్రీను వైట్ల ‘ఫస్ట్ స్ట్రైక్‘ వస్తోంది

మాచో స్టార్ గోపీచంద్ – సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘వైట్లమాచో‘ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడీగా కావ్య థాపర్ నటిస్తుంది. ఇప్పటికే మేకింగ్ వీడియోస్ తో అటెన్షన్ పెంచిన ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ స్ట్రైక్‘ పేరుతో స్పెషల్ గ్లింప్స్ ఏప్రిల్ 11న రాబోతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ ‘ఫస్ట్ స్ట్రైక్‘ గురించి క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.

Related Posts